
India Vs West Indies Last T20 Match, కోల్‌కతా: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు టి20ల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 2–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా నేడు విండీస్‌తో చివరిదైన మూడో టి20లో తలపడనుంది. భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్‌ను గెలుపుతో ముగిస్తుందా లేక ఈ పర్యటనలో కనీసం ఒక్క విజయంతోనైనా విండీస్ వెనుదిరుగుతుందా చూడాలి. ఈ మ్యాచ్‌తోపాటు శ్రీలంకతో టి20 సిరీస్ నుంచి కోహ్లి, పంత్ తప్పుకోవడంతో భారత్ రెండు మార్పులు చేయడం ఖాయమైంది. ఓపెనర్ గా రుతురాజ్, కోహ్లి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కనుంది. బౌలింగ్‌లో కూడా చహర్, భువనేశ్వర్‌లలో ఒకరిని పక్కన పెట్టి సిరాజ్ లేదా అవేశ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment