ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, బౌలింగ్‌లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్‌లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్‌కు చేరుకున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.
బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్‌పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్‌కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు చేరాడు.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న ముగిసిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్‌లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment