శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.
ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్‌లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించింది.
కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు.
అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్‌గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్‌పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment