శ్రీలంకతో చివరిదైన మూడో టీ20 ఇవాళ (జులై 30) జరుగనుంది. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. తొలి రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
సిరీస్ ఫలితం తేలిపోవడంతో నేటి మ్యాచ్‌లో భారత్ ప్రయోగాల బాట పట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటివరకు అవకాశాలు రాని వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో టీ20కి ముందు మెడ కండరాలు పట్టేయడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్ నేటి మ్యాచ్‌కు కూడా బెంచ్‌కే పరిమితం కావచ్చు.
మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దూబే.. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు శ్రీలంక నేటి మ్యాచ్ కోసం పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించవచ్చు. ఆ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంకకు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయింది. రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ స్వల్ప వ్యవధిలో పేకమేడలా కూలింది.
ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచాలని భావిస్తుంది. ఈ సిరీస్ అనంతరం కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 2, 4 , 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత వన్డే ప్లేయర్లు ఇప్పటికే కొలొంబోకు చేరుకున్నారు. నిన్న వర్షం కారణంగా భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ చేయలేకపోయారు.
తుది జట్లు (అంచనా)..
టీమిండియా: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment