మహిళల టీ20 వరల్డ్‌కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది.
గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్‌లో (పాక్‌పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్‌లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరం
గ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్‌కు ఈ మ్యాచ్‌కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్‌కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.
అక్టోబర్ 6న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్‌లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment