నేడు దక్షిణాఫ్రికాతో భారత మహిళల టి20 మ్యాచ్
రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
చెన్నై: దక్షిణాఫ్రికా జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి... ఏకైక టెస్టులోనూ ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టుకు టి20 సిరీస్ కలిసి రాలేదు. తొలి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి రెండో టి20లో విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు వరుణుడు అవకాశం ఇవ్వలేదు.
దాంతో రెండో టి20 ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20లో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే మంగళవారం కూడా వర్ష సూచన ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు రాణించలేకపోయారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో భారత బౌలర్ల నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment