వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాగేసుకుపోతాడు..! | IND vs AUS 3rd T20: Maxwell Has Played 2 Great Knocks While Chasing In A Gap Of 21 Days - Sakshi
Sakshi News home page

IND VS AUS 3rd T20: 21 రోజులు.. రెండు సెంచరీలు.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!

Published Wed, Nov 29 2023 11:03 AM | Last Updated on Wed, Nov 29 2023 11:27 AM

IND VS AUS 3rd T20: Maxwell Has Played 2 Great Knocks While Chasing In A Gap Of 21 Days - Sakshi

ఆసీస్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో విరుచుకుపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లోనే శతక్కొట్టిన (9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106) మ్యాక్సీ.. అదే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం (128 బంతుల్లో 201 నాటౌట్‌; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. 

తాజాగా భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ ఇంచుమించు అలాంటి మెరుపు ఇన్నింగ్సే ఆడిన మ్యాక్సీ.. ఈ మ్యాచ్‌లోనూ తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి ఛేజింగ్‌లో కింగ్‌ అనిపించుకున్నాడు.  మ్యాక్సీ గత 21 రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో ఛేజింగ్ చేస్తూ రెండు చిరస్మరణీయ సెంచరీలు సాధించాడు. దీంతో సోషల్‌మీడియా మొత్తం అతని నామస్మరణతో మార్మోగిపోతుంది. వీడెక్కడి మనిషి రా బాబూ.. టోర్నడోలా వచ్చి అమాంతం మ్యాచ్‌ను ఎగరేసుకుపోతాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఆసీస్‌ గెలవడం కష్టం అనుకున్న ప్రతిసారి మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను లగేసుకుంటున్న వైనాన్ని కొనియాడుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మ్యాక్స్‌వెల్‌ను మించినోడు లేడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పొట్టి క్రికెట్‌లో ఇతనికి మించిన ఫినిషన్‌ లేడు, రాబోడని కితాబునిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement