IND VS SL 3rd T20: Records That Suryakumar Yadav Broke During His 112 Knock - Sakshi
Sakshi News home page

IND VS SL 3rd T20: సునామీ శతకంతో సూర్యకుమార్‌ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!

Published Sun, Jan 8 2023 12:15 PM | Last Updated on Sun, Jan 8 2023 2:49 PM

IND VS SL 3rd T20: Records That Suryakumar Yadav Broke During His 112 Knock - Sakshi

Surya Kumar Yadav: రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 7) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను హార్ధిక్‌ సేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సునామీ శతకం (51 బంతుల్లో 112 నాటౌట్‌; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటికి నిశ్చేష్టులుగా మిగిలిపోయిన లంకేయులు మ్యాచ్‌లో పాటు సిరీస్‌ను భారత్‌ చేతికి అప్పజెప్పారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ కళ్లు చెదిరే శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగితే శుభ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (9 బంతుల్లో 21 నాటౌట్‌; 4 ఫోర్లు) తమ పాత్రలను న్యాయం చేశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, చహల్‌ తలో 2 వికెట్లు, అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ విధ్వంసకర శతకం సాధించే క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే..

పొట్టి క్రికెట్‌ చరిత్రలో మూడు వేర్వేరు ఖండాల్లో (ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, భారత్‌) శతకాలు సాధించిన అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్న సూర్యకుమార్‌.  

  • టీ20ల్లో భార‌త్ త‌ర‌ఫున అత్యధిక సెంచ‌రీలు (3) చేసిన రెండో క్రికెట‌ర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శ‌ర్మ నాలుగు సెంచ‌రీల‌తో అగ్రస్థానంలో ఉండగా.. రెండు సెంచ‌రీల‌తో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. 
  • టీ20ల్లో అత్యంత వేగంగా సెంచ‌రీ (45 బంతుల్లో) చేసిన రెండో భారత క్రికెట‌ర్‌గా సూర్య కుమార్ యాద‌వ్ రికార్డుల్లో నిలిచాడు. గ‌తంలో శ్రీలంక‌పై రోహిత్ శ‌ర్మ 35 బంతుల్లోనే సెంచ‌రీ బాదాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో (46 బంతుల్లో) ఉన్నాడు. 
  • అంత‌ర్జాతీయ టీ20ల్లో మూడు లేదా అంత‌కంటే ఎక్కువ సెంచ‌రీలు చేసిన ఐదో ప్లేయ‌ర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో నాలుగు సెంచ‌రీల‌తో రోహిత్ శ‌ర్మ అగ్రస్థానంలో ఉండగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (3), కొలిన్ మన్రో (3), స‌బావూన్ డావిజీ (3)లతో క‌లిసి సూర్య భాయ్‌ రెండో స్థానంలో ఉన్నాడు.
  • అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్‌ ఓపెనర్‌గా, అలాగే అత్యంత వేగంగా (843 బంతుల్లో ) 1500 పరుగుల  మార్కును (బంతుల ప్రకారం) అందుకున్న ఆటగాడిగా సూర్య భాయ్‌ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు మ్యాక్స్‌వెల్‌ పేరిట ఉండేది. మాక్సీ.. 1500 పరుగులు చేసేందుకు 940 బంతులు ఎదుర్కొన్నాడు.
  • టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (9) బాదిన భారత నాన్‌ ఓపెనర్‌గా రికార్డు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement