తిరువనంతపురం వేదికగా ఆదివారం(జనవరి15)న శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేలకు దూరమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆఖరి వన్డేకు జట్టులోకి రానున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఓపెనర్ శుబ్‌మాన్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మూడో వన్డేకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనేజెమెంట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి రెండు వన్డేల్లో గిల్ పర్వాలేదనిపించినప్పటికీ.. అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. రెండు వన్డేల్లో కలిపి కేవలం 56 పరుగులు మాత్రమే అయ్యర్ చేశారడు. ఇక ఆఖరి వన్డేలో పలు మార్పులు చేయనున్నట్లు రెండో వన్డే పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ కూడా తెలిపాడు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్,మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ
చదవండి: బాబర్ ఆజమ్‌పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
Comments
Please login to add a commentAdd a comment