శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన టీమిండియా స్టార్ టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పరుగుల యంత్రం, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి పేరిట ఉన్న సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డును శ్రేయస్ బ్రేక్ చేశాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (2016లో ఆస్ట్రేలియాపై) కోహ్లి అత్యధికంగా 199 పరుగులు చేయగా, తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో శ్రేయస్.. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 204 పరుగులు సాధించి కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు.
Shreyas Iyer scored 204 runs at a Strike Rate of 174.35 without even being dismissed once against Sri Lanka in the T20i series. He now holds the record for India of scoring most runs in a 3 match bilateral T20i series. pic.twitter.com/CGupBe9KqR
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 27, 2022
ఈ సిరీస్ మొత్తం అజేయంగా నిలిచిన శ్రేయస్.. తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 57 పరుగులు, రెండో మ్యాచ్‌లో 44 బంతుల్లో 74 పరుగులు, మూడో మ్యాచ్‌లో 45 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించిన శ్రేయస్.. కోహ్లి (2012, 2014, 2016), రోహిత్ శర్మ (2018), కేఎల్ రాహుల్ (2018, 2021)ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో కెప్టెన్ దసున్ శనక (37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) ఒంటిరి పోరాటం చేయడంతో లంక జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. శనకకు చండీమాల్(27 బంతుల్లో 2 ఫోర్లతో 25) సహకరించడంతో లంకేయులు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లంక నిర్ధేశించిన 147 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా మరో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా 12వ మ్యాచ్‌లో విజయం సాధించి అఫ్ఘానిస్థాన్ పేరిట ఉన్న అత్యధిక వరుస విజయాల రికార్డును సమం చేసింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73; 9 ఫోర్లు, సిక్సర్) సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 22 నాటౌట్) శ్రేయస్‌కు సహకరించాడు. టీ20ల్లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా (16 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో కుమార 2, చమీరా, కరుణరత్నే తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment