IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్‌ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్‌ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్‌ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్‌ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్‌దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత.
Comments
Please login to add a commentAdd a comment