భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 10) రెండో టీ20 జరుగనుంది. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.
అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!
ఇవాళ జరుగనున్న రెండో టీ20లో అర్షదీప్ సింగ్ మరో మూడు వికెట్లు తీస్తే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న ఈ రికార్డును అర్షదీప్ సింగ్ బద్దలు కొడతాడు. భువీ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ కేవలం 57 మ్యాచ్‌ల్లోనే 88 వికెట్లు తీశాడు.
అర్షదీప్ సింగ్ మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను కూడా అధిగమిస్తాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత యుజ్వేంద్ర చహల్‌కు దక్కుతుంది. చహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా..
చహల్- 96
భువనేశ్వర్ కుమార్- 90
జస్ప్రీత్ బుమ్రా- 89
అర్షదీప్ సింగ్- 88
హార్దిక్ పాండ్యా- 87
కాగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ శతక్కొట్టడంతో (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. ఆవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాల్డ్ కొయెట్జీ (23), ర్యాన్ రికెల్టన్ (21), డేవిడ్ మిల్లర్ (18), ట్రిస్టన్ స్టబ్స్ (11), మార్కో జన్సెన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment