IND VS SA 1st ODI: సౌతాఫ్రికాపై టీమిండియా పేసర్ల చరిత్ర | IND VS SA 1st ODI: Indian Players Records Most Wickets Vs SA In An ODI Innings | Sakshi
Sakshi News home page

IND VS SA 1st ODI: సౌతాఫ్రికాపై టీమిండియా పేసర్ల చరిత్ర

Published Sun, Dec 17 2023 5:21 PM | Last Updated on Sun, Dec 17 2023 6:52 PM

IND VS SA 1st ODI: Indian Players Records Most Wickets Vs SA In An ODI Innings - Sakshi

దక్షిణాఫ్రికాపై టీమిండియా పేసర్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పేసర్లు ఓ మ్యాచ్‌లో (వన్డే) అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టారు. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్‌లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేస్‌ గన్స్‌ 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా భారత పేస్‌ ద్వయం అర్ష్‌దీప్‌ సింగ్‌ (10-0-37-5), ఆవేశ్‌ ఖాన్‌ (8-3-27-4) ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఈ రికార్డు నెలకొల్పారు. 

మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. భారత పేస్‌ ద్వయం అర్ష్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్‌ యాదవ్‌కు ఓ వికెట్‌ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో​ జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్‌ (12), తబ్రేజ్‌ షంషి (11 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన భారత్‌.. ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 9 ఓవర్ల తర్వాత  భారత్‌ రుతురాజ్‌ (5) వికెట్‌ కోల్పోయి 55 పరుగులు చేసింది. భారత్‌ విజయం సాధించాలంటే మరో 62 పరుగులు చేయాలి. రుతురాజ్‌ వికెట్‌ ముల్దర్‌కు దక్కింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement