
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఆసీస్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0 తో సొంతం చేసుకుంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడం బంగ్లాదేశ్‌కు ఇదే ప్రథమం. తొలుత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ మహ్ముదుల్లా (53 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్ మార్‡్ష (47 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆసీస్‌ను గెలిపించలేకపోయాడు.
అరంగేట్రంలో ఎలీస్ హ్యాట్రిక్
ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అరం గేట్రం చేసిన నాథన్ ఎలీస్... తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్ పదును చూపెట్టాడు. 20వ ఓవర్‌లో బౌలింగ్ వచ్చిన అతడు చివరి మూడు బంతుల్లో వరుసగా... మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, మెహదీ హసన్‌లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ను పూర్తి చేశాడు. అరంగేట్రంలో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఎలీస్ ఘనతకెక్కాడు. ఓవరాల్‌గా టి20ల్లో ఇది 17వ హ్యాట్రిక్.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)