స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్‌ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం | India Vs South Africa 3rd T20I Live Updates And News - Sakshi
Sakshi News home page

స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్‌ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం

Published Thu, Dec 14 2023 8:10 PM | Last Updated on Thu, Dec 14 2023 11:54 PM

IND VS SA 3rd T20 Updates And Highlights - Sakshi

స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్‌ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో డ్రాగా (తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది) ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత సూర్యకుమార్‌ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడగా.. అనంతరం కుల్దీప్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో (2.5-0-17-5) మాయాజాలం చేసి టీమిండియాను గెలిపించారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. స్కై శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా కుల్దీప్‌ ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో జడేజా 2, అర్షదీప్‌, ముకేశ్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మిల్లర్‌ (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
89 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో కేశవ్‌ మహారాజ్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
82 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫెహ్లుక్వాయో (0) ఔటయ్యాడు.

75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
202 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఫెరియెరా (12) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
జడేజా బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి మార్క్రమ్‌ (25) ఔటయ్యాడు. 6.1 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 42/4గా ఉంది.

మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
42 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ (5) క్యాచ్‌ ఔటయ్యాడు. 5.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 42/3గా ఉంది. మార్క్రమ్‌ (25), మిల్లర్‌ క్రీజ్‌లో ఉన్నారు.

టార్గెట్‌ 202.. రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
సిరాజ్‌ అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో రీజా హెండ్రిక్స్‌ను (8) రనౌట్‌ చేశాడు.

టార్గెట్‌ 202.. తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
ముకేశ్‌ కుమార్‌ వేసిన రెండో ఓవర్‌లో సౌతాఫ్రికా వికెట్‌ కోల్పోయింది. ముకేశ్‌ బౌలింగ్‌లో బ్రీట్జ్కీ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అంతకుముందు తొలి ఓవర్‌ను సిరాజ్‌ మెయిడిన్‌ చేశాడు.

సూర్యకుమార్‌ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్‌
సూర్యకుమార్‌ యాదవ్‌ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్‌ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్‌ చేసింది. ఆఖరి ఓవర్‌లో భారత్‌ మూడు వికెట్లు​ కోల్పోయింది. జడేజాను (4) అనవసరంగా రనౌట్‌ చేసిన జితేశ్‌ శర్మ (4) హిట్‌ వికెట్‌గా ఔటయ్యాడు. 

సూర్యకుమార్‌ ఊచకోత.. 55 బంతుల్లో శతకం
టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 19.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 194/4గా ఉంది. స్కైతో పాటు జితేశ్‌ శర్మ క్రీజ్‌లో ఉన్నాడు.

సెంచరీకి చేరువైన స్కై
హాఫ్‌ సెంచరీ తర్వాత పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న స్కై సెంచరీకి చేరువయ్యాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 173/3గా ఉంది. స్కైతో పాటు రింకూ (5) క్రీజ్‌లో ఉన్నాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. జైస్వాల్‌ ఔట్‌
141 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. షంషి బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ (60) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 141/3గా ఉంది. సూర్యకుమార్‌ (65), రింకూ సింగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 108/2
12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 108/2గా ఉంది. జైస్వాల్‌ (57), స్కై (35) ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నారు.

2 వికెట్లు పడ్డా చెలరేగి ఆడుతున్న జైస్వాల్‌, స్కై
మూడో ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడుతున్నారు. జైస్వాల్‌ (28), జ్కై (19) పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 62/2గా ఉంది.

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా
29 పరుగుల వద్ద (2.2 ఓవర్లు) టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. అతర్వాతి బంతికే టీమిండియా మరో వికెట్‌ కూడా కోల్పోయింది. కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (12), తిలక్‌ వర్మ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు.

తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన గిల్‌
రెండో టీ20లో డకౌట్‌ అయిన శుభ్‌మన్‌ గిల్‌.. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అరంగేట్రం బౌలర్‌ నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో చివరి 3 బంతులను గిల్‌ బౌండరీలుగా మలిచాడు.

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం సౌతాఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేయగా.. భారత్‌, రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగిస్తుంది. ట్రిస్టన్‌ స్టబ్స్ స్థానంలో డొనొవన్‌ ఫెరియెరా.. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ స్థానాల్లో కేశవ్‌ మహారాజ్‌, నండ్రే బర్గర్‌ జట్టులోకి వచ్చారు. 

టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌‌మన్‌ గిల్, తిలక్‌ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్.

సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్‌ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్‌ ఫెరియెరా, డేవిడ్ మిల్లర్, కేశవ్‌ మహారాజ్‌, నండ్రే బర్గర్‌, అండిల్‌ ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్‌ షంసీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement