దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 3-1తో సూర్య సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
సిక్సర్లు, ఫోర్ల వర్షంతో వాండరర్స్ మైదానం తడిసి ముద్దైంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ అద్బుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120, సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. అదేవిధంగా ఈ యువ జోడీ రెండో వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.
దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ప్రోటీస్ జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
ఆసీస్ రికార్డు బద్దలు..
👉సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు 31 టీ20లు ఆడి 18 విజయాలు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు నమోదు చేసింది.
తాజా మ్యాచ్‌తో ఆసీస్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.
👉టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు(284). గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది.
👉అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం(210) జోడించిన జోడీగా తిలక్-శాంసన్ నిలిచారు. దీంతో రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment