టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వరుసగా రెండు టీ20ల్లో డకౌటై నిరాశపరిచిన సంజూ.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.
తిలక్ వర్మతో స్కోర్ బోర్డును ఈ కేరళ స్టార్ బ్యాటర్ పరుగులు పెట్టించాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఇక అద్భుత సెంచరీతో చెలరేగిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
చరిత్ర సృష్టించిన శాంసన్
👉అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శాంసన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో సంజూకు ఇది మూడో సెంచరీ. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను సంజూ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచక్రికెట్‌లో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించలేదు.
👉అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. సంజూ కంటే ముందు ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
భారత్ ఘన విజయం
ఇక ఈ మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(47 బంతుల్లో 120 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో ప్రోటీస్ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా
Comments
Please login to add a commentAdd a comment