టీమిండియా అభిమానులకు శుభవార్త. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 20న జరిగే చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌కు ఇరవై వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. వీరిలో అధిక శాతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) టికెట్ హోల్డర్స్ ఉంటారని బీసీసీఐ పేర్కొంది.
బీసీసీఐ నిర్ణయం పట్ల క్యాబ్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా హర్షం వ్యక్తం చేశాడు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ప్రస్తుత పర్యటనలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ (తొలి టీ20).. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను మహమ్మారి నుంచి రక్షించే ఉద్దేశంతోనే మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడం లేదని బీసీసీఐ బాస్ గంగూలీ గతంలో వెల్లడించాడు.
అయితే, నిన్న జరిగిన తొలి టీ20తో పాటు ఫిబ్రవరి 18న (శుక్రవారం) జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం 2000 మందికి పైగా అభిమానులు స్టేడియంలో కూర్చునేందుకు బీసీసీఐ అనుమతించడం విశేషం. ఇదిలా ఉంటే, విండీస్ తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ లో టీమిండియా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో విజయాలు సాధించి, జోరుమీదుంది. వన్డే సిరీస్ ను 3-0తో, టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది.
చదవండి: IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..!
Comments
Please login to add a commentAdd a comment