IND Vs AUS, 3rd T20: Rohit Sharma Praising Over Hyderabad Biryani - Sakshi

Ind Vs Aus 3rd T20- Rohit Sharma: హైదరాబాద్‌ బిర్యానీకి రోహిత్‌ ఫిదా 

Sep 26 2022 3:58 AM | Updated on Sep 26 2022 8:47 AM

Rohit Sharma Fida For Hyderabad Biryani - Sakshi

India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad- బంజారాహిల్స్‌: హైదరాబాద్‌ బిర్యానీకి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిదా అయ్యారు. ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్‌ కోసం శనివారం హైదరాబాద్‌కు వచ్చిన రోహిత్‌ శర్మ జట్టుసభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో బస చేశారు.

అయితే మల్కాజ్‌గిరిలో నివసించే భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ ఆహ్వానం మేరకు శనివారంరాత్రి రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్, మిగతా కోచ్‌లు, అసిస్టెంట్లతో కలిసి ఆయన ఇంటికి విందుకు వెళ్లారు. గోల్కొండ హోటల్‌ నుంచి తీసుకొచ్చిన బిర్యానీని రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రావిడ్, మిగతా సిబ్బంది పసందుగా ఆరగించారు.

రుచికరమైన బిర్యానీని వడ్డించిన గోల్కొండ హోటల్‌ సిబ్బందితో రోహిత్‌ శర్మ సెల్ఫీ తీసుకున్నారు.  ఇక ఆదివారం మూడో టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు సన్నద్ధమయ్యే పనిలో పడింది.

చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్‌.. భారత్‌ భలే గెలుపు
IND vs Aus: కార్తీక్‌పై మరోసారి సీరియస్‌ అయిన రోహిత్‌!.. కానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement