Breadcrumb
మెరిసిన శ్రేయస్.. మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
Published Sun, Feb 27 2022 6:12 PM | Last Updated on Sun, Feb 27 2022 10:34 PM
Live Updates
ఇండియా వర్సస్ శ్రీలంక మూడో టీ20 లైవ్ అప్డేట్స్
మెరిసిన శ్రేయస్.. మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
లంక నిర్ధేశించిన 147 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా మరో 19 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా 12వ మ్యాచ్‌లో విజయం సాధించి అఫ్ఘానిస్థాన్ పేరిట ఉన్న అత్యధిక వరుస విజయాల రికార్డును సమం చేసింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73; 9 ఫోర్లు, సిక్సర్) సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 22 నాటౌట్) శ్రేయస్‌కు సహకరించాడు. టీ20ల్లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా (16 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో కుమార 2, చమీరా, కరుణరత్నే తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు దసున్ శనక (37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) ఒంటిరి పోరాటం చేయడంతో మూడో టీ20లో లంక జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. శనకకు చండీమాల్(27 బంతుల్లో 2 ఫోర్లతో 25) సహకరించడంతో లంకేయులు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
కుమార వేసిన 13వ ఓవర్లో జయవిక్రమకు క్యాచ్ ఇచ్చి వెంకటేశ్ అయ్యర్ (4 బంతుల్లో 5) ఔటయ్యాడు. 12.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 103/4. రవీంద్ర జడేజాక్రీజ్లోని వచ్చాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ మరో హాఫ్ సెంచరీ
దూకుడుగా ఆడుతున్న దీపక్ హుడా (16 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) 11వ ఓవర్ ఆఖరి బంతికి లహీరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం 12వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్సర్) సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 102/3. శ్రేయస్‌తో పాటు క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్ ఉన్నాడు.
లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా
147 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 42; 5 ఫోర్లు), దీపక్ హుడా (14 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 86/2.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండయా.. శాంసన్ (18)ఔట్
147 పరుగుల నామమాత్రపు టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఏడో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. కరుణరత్నే బౌలింగ్‌లో వికెట్‌కీపర్ చండీమాల్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (12 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 28; 5 ఫోర్లు) దూకుడుగా ఆడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 55/2.
నిరాశపర్చిన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (9 బంతుల్లో 5) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో చమీరా బౌలింగ్‌లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 7/1గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఉన్నారు.
శనక ఒంటరి పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన శ్రీలంక
కెప్టెన్ దసున్ శనక (37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) ఒంటిరి పోరాటం చేయడంతో మూడో టీ20లో లంక జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. శనకకు చండీమాల్(27 బంతుల్లో 2 ఫోర్లతో 25) సహకరించడంతో లంకేయులు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన శనక
లంక కెప్టెన్ శనక (29 బంతుల్లో 51 7 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20లోనూ ఆఖర్లో మెరుపులు మెపిరించిన శనక ఈ మ్యాచ్‌లోనూ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఫలితంగా శ్రీలంక స్కోర్ 18.1 ఓవర్ల తర్వాత 119/5గా ఉంది.
60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక
టీమిండియా బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. హర్షల్ పటేల్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి చండీమాల్ (27 బంతుల్లో 2 ఫోర్లతో 25) ఔటయ్యాడు. ఫలితంగా లంక జట్టు 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో షనక (11), కరుణరత్నే ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
యువ స్పిన్నర్ బిష్ణోయ్ వేసిన 9వ ఓవర్లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ విసిరిన గూగ్లి బంతికి లియనాగే (19 బంతుల్లో 9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా శ్రీలంక 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో చండీమాల్, శనక ఉన్నారు.
11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు పేక మేడలా కూలుతుంది. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి 3 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 4వ ఓవర్ ఆఖరి బంతికి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అసలంక (6 బంతుల్లో 4) వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో జనిత్ లియనాగే (2), చండీమాల్ ఉన్నారు.
వరుసగా రెండో ఓవర్లోనూ వికెట్ కోల్పోయిన శ్రీలంక
సిరాజ్ బౌల్ చేసిన తొలి ఓవర్లో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. వరుసగా రెండో ఓవర్లోనూ వికెట్ చేజార్చుకుంది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (10 బంతుల్లో 1) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 2 వికెట్ల నష్టానికి 5 పరుగులు. క్రీజ్‌లో అసలంక, లియనాగే ఉన్నారు.
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన శ్రీలంక
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో లంక ఓపెనర్ గుణతిలక (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్ తర్వాత లంక స్కోర్ 1/1.
Related News By Category
Related News By Tags
-
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్...
-
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం
-
టీమిండియా ఘోర ఓటమి..సిరీస్ శ్రీలంక వశం
టీమిండియా ఘోర ఓటమి..సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించిన శ్రీలంక భారత్ పై 7 వికెట్లతేడాతో ఘన వి...
-
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించిం...
-
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొ...
Comments
Please login to add a commentAdd a comment