Dharamvir Singh
-
‘అధర్మవీర్’
♦ డోపింగ్‌లో దొరికిన ధరమ్వీర్ సింగ్ ♦ అథ్లెట్ ‘ఎ’ శాంపిల్ పాజిటివ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు మరో భారత ఆటగాడు డోపింగ్ వివాదంలో నిలిచాడు. 200 మీ. పరుగులో పాల్గొనేందుకు అర్హత సాధించిన అథ్లెట్ ధరమ్వీర్ సింగ్ నిషేధిక ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. అతని ‘ఎ’ శాంపిల్ నివేదిక పాజిటివ్‌గా వచ్చినట్లు, అందులో అనబాలిక్ స్టెరాయిడ్ గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారికంగా ప్రకటించలేదు. మంగళవారం రాత్రి ఇతర భారత జట్టు సభ్యులతో కలిసి ధరమ్వీర్ రియోకు బయల్దేరాల్సి ఉంది. కానీ అతడు జట్టుతో చేరకపోవడంతో అనుమానం తలెత్తింది. దీనిపై వివరణ ఇస్తూ ‘నాడా’ అధికారి ఒకరు అథ్లెట్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఒక ఆటగాడు పట్టుబడ్డాడనే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. అతని ‘బి’ శాంపిల్ కూడా పరీక్షించాల్సి ఉంది. దాని ఫలితాలు వచ్చేందుకు కనీసం వారం రోజులు పడుతుంది కాబట్టి ఒక వేళ అందులో నెగెటివ్‌గా తేలినా... ధరమ్వీర్ రియో వెళ్లగలడా లేదా అనేది సందేహమే. రెండో సారి హరియాణాలోకి రోహ్టక్కు చెందిన ధరమ్వీర్ బెంగళూరులో జరిగిన జాతీయ మీట్లో 20.45 సెకన్లలో 200 మీ. పరుగు పూర్తి చేసి (అర్హతా ప్రమాణం 20.50 సె.) ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 36 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే గత కొంత కాలంగా పెద్దగా రాణించలేకపోతున్న ధరమ్వీర్ సాధించిన టైమింగ్‌పై అప్పుడే కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు. జాతీయ శిబిరంలో కాకుండా రోహ్టక్లో సొంత కోచ్‌తో కలిసి సాధన చేస్తుండటం అనుమానాలు పెంచింది. 2012లోనే జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీ. పరుగులో ధరమ్వీర్ స్వర్ణం సాధించాడు. అయితే డోపింగ్ పరీక్షలో పాల్గొనేందుకు నిరాకరించాడు. దాంతో అధికారులు అతని పతకాన్ని రద్దు చేశారు. గత రికార్డు కారణంగా ఈ సారి మళ్లీ డోపీగా తేలితే అతనిపై కనీసం ఎనిమిదేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. -
‘అర్జున’కు రీతూ రాణి, రఘునాథ్ పేర్లు ప్రతిపాదన
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు కెప్టెన్ రీతూ రాణి... భారత పురుషుల జట్టు కీలక ఆటగాళ్లు రఘునాథ్, ధరమ్వీర్ సింగ్ పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదన చేశామని హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. మరోవైపు 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు సిల్వానస్ డుంగ్ డుంగ్ పేరును ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారానికి... వెటరన్ కోచ్ సీఆర్ కుమార్ పేరును ద్రోణాచార్య అవార్డు కోసం సిఫారసు చేశారు. హరియాణాకు చెందిన 25 ఏళ్ల రీతూ రాణి భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. కర్ణాటక ప్లేయర్ రఘునాథ్ 203 మ్యాచ్‌లు ఆడి 127 గోల్స్ చేయగా... పంజాబ్‌కు చెందిన ధరమ్వీర్ 126 మ్యాచ్‌ల్లో పాల్గొని 31 గోల్స్ సాధించాడు. -
భారత్‌ను గెలిపించిన ధరమ్వీర్
మూడో హాకీ టెస్టులో కివీస్ ఓటమి క్రైస్ట్‌చర్చ్: మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ధరమ్వీర్ సింగ్ సూపర్ గోల్ చేసి డ్రా ఖాయమనుకున్న మ్యాచ్‌ను భారత్ వశం చేశాడు. ఫలితంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో హోరాహోరీగా జరిగిన మూడో టెస్టులో భారత్ 3-2తో విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇరు జట్ల మధ్య చివరి టెస్టు జరుగుతుంది. భారత్‌కు 10వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు. రెండో క్వార్టర్ 22వ నిమిషంలో భారత డిఫెన్స్‌ను ఏమార్చుతూ కివీస్ తొలి గోల్ సాధించింది. అయితే 41వ నిమిషంలో ఆకాశ్‌దీప్ పాస్‌ను అందుకున్న రమణ్‌దీప్ ఫీల్డ్ గోల్‌తో స్కోరును పెంచాడు. నాలుగో క్వార్టర్లో భారత గోల్ అవకాశాలను కివీస్ అడ్డుకుంది. 52వ నిమిషంలో స్టీవ్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్‌తో స్కోరు 2-2తో సమమైంది. ఇక మ్యాచ్ మరో 40 సెకన్లలో ముగుస్తుందనగా ధరమ్వీర్ అద్భుత గోల్‌తో భారత్ నెగ్గింది. -
ప్లాట్ ఫాం స్కూల్.. పోలీసు మాస్టారు
న్యూఢిల్లీ: సాధారణంగా పోలీసులు వస్తున్నారంటే చాలు చిన్నపిల్లలేకాదు పెద్దవారికి కూడా చాలా భయం ఉంటుంది. వారి చేతిలో లాఠీ, చంకలో తుపాకీ, బూట్ల చప్పుడు భయం కలిగిస్తాయి. కానీ, అలాంటిది కనిపిస్తే చాలు తన్ని తరిమేసే పోలీసు దగ్గరికి రైల్వే స్టేషన్లలో పాపాడ్స్ అమ్ముకునే బతికే పిల్లలు విధిగా ఏం భయం లేకుండా వెళుతుంటే. అది కూడా టైం అయింది రండి పాఠాలు చెప్తురుగానీ అని ఆయనను పిలిస్తే.. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో రోజూ ఇదే జరుగుతుంది. అప్పటి వరకు ఏ పోలీసులు వచ్చిన తమను పాపాడ్స్ అమ్ముకోనివ్వకుండా దెబ్బలు కొట్టి జీపులో ఎక్కించుకెళ్లే పోలీసులు, తన్ని తరిమేసి పోలీసులను చూసిన అక్కడి మురికివాడల్లో నివసించే పిల్లలు తొలిసారి మానవత్వాన్ని, సేవాగుణాన్ని ఓ పోలీసు రూపంలో బహుమానంగా పొందారు. ప్రేమగా దగ్గరకు తీసుకొని ఓపికతో విద్యాబుద్ధులు నేర్పించే గురువులాంటి పోలీసుకు చిక్కారు. దీంతో వారు రోజంతా ఏం చేసినా కచ్చితంగా ఓ గంటపాటు తప్పకుండా పుస్తకం పట్టాల్సిందే నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిందే. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండే స్లమ్ ఏరియాలోని పిల్లలు ప్రతి రోజు పాపాడ్స్ అమ్ముకునేందుకు రైల్వేస్టేషన్‌కు రావడం, అమ్ముకుంటుండటం, అప్పుడప్పుడు వారిలో వారే కొట్టుకోవడం, ఒక క్రమ పద్ధతిలేకుండా జీవించడం పరిపాటి. కొన్నిసార్లు పోలీసుల చేతికి చిక్కితే కొట్టి జీపులో తీసుకొని వెళ్లేవారు. అయితే, గత నాలుగు నెలల కిందట ధరమ్ వీర్ సింగ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా అక్కడి స్టేషన్ కు వచ్చాడు. అయితే, ఆ పిల్లల గురించి అతడు కొత్తగా ఆలోచించి రోజు గంటపాటు చదువుకోవాలని ఆ తర్వాత పాపాడ్స్ అమ్ముకునేందుకు అనుమతిస్తానని చెప్పాడు. అలా ఆ పిల్లలు, కానిస్టేబుల్ మధ్య ఒప్పందం కుదుర్చుకొని అప్పటి నుంచి ఆ స్టేషన్ ప్రాంగణంలోని ఓ చోటు ప్లాట్ ఫాం పాఠశాలగా మారింది. ధరమ్ వీర్ సింగ్ చూపిస్తున్న మానవత్వం, సేవాదృక్పథంపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.