సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లో వందలాది కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు పొరపాటున సమాన్యుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నాయి. ఆశ్చర్యానికి లోనైన ఖాతాదారులు తేరుకునే లోపు పొరపాట్లను తెలుసుకుని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నాయి.
తాజాగా చెన్నైలో ఓ ఫార్మసీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమయ్యాయి. మహమ్మద్ ఇద్రీస్ తన కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra bank) ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) రూ.2000 లను స్నేహితుడికి బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత, తన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోగా రూ. 753 కోట్ల బ్యాలెన్స్ కనిపించింది.
బ్యాంక్ అకౌంట్‌లో అంత పెద్ద మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైన ఇద్రిస్ వెంటనే బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. దీంతో బ్యాంకు అధికారులు వెంటనే ఆయన అకౌంట్‌ను స్తంభింపజేశారు. ఈ పెద్ద మొత్తం కనిపించిన దురాశకు పోకుండా బ్యాంకు అధికారులకు తెలియజేసిన ఇద్రిస్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్‌లో ఖాతాలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రూ.9,000 కోట్లు డిపాజిట్ చేసింది. పొరపాటును గుర్తించిన బ్యాంకు ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అంతకు ముందు తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలోనూ రూ. 756 కోట్లు జమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment