సాక్షి, నెల్లూరు: కరవమన్న పాము ఎదురుతిరిగి కాలికే చుట్టుకున్నట్టు తయారైంది టీడీపీ నేతల పరిస్థితి. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి ప్రలోభాలతో ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ నేతలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కోట్ల రూపాయలు ఇస్తాం.. తమ పక్షంలోకి రండంటూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులను ఆకర్షించే ప్రయత్నం చేసినవారి ప్రలోభాల కథ ఇప్పుడు అడ్డం తిరుగుతోంది. ప్రతిపాక్ష పార్టీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం గమనించిన సొంతపార్టీ సభ్యులు ఎదురుతిరుగుతున్నారు. ఎదుటి పార్టీ వారికే అంత ఇచ్చినప్పుడు తమ సంగతేంటని ప్రశ్నిస్తుండడంతో నేతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవలే టీడీపీకి చెందిన ఓ జెడ్పీటీసీ సభ్యుడు వైస్ చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలనే డిమాండ్‌ను నాయకుల ముందు పెట్టాడు. ఖంగుతిన్న నాయకులు ఆయనను వెంటనే నగర శివారులో ఉన్న తమ అడ్డాకు తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు.
‘కావాలంటే అంతో.. ఇంతో ఇస్తాం. వైస్ ైచె ర్మన్ పదవి కావాలంటే ఎలా’అని ఆ సభ్యుడిని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. తర్వాత రోజు ఉదయాన్నే ఆ జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపక్ష పార్టీ నేతను కలిసి వైస్ చైర్మన్ పదవి తనకు ఇస్తే ‘నా మద్దతు మీకే’ అంటూ ఆఫర్ పెట్టాడు. ఇది తెలుసుకున్న టీడీపీ నేతలు షాక్‌కు గురై వెంటనే సభ్యుడిని మళ్లీ తమ అడ్డాకు తీసుకెళ్లి బుజ్జగించినట్లు సమాచారం. ఇదంతా తెలుసుకున్న ఆ పార్టీకి చెందిన మరికొంత మంది సభ్యులు కూడా తమ సంగతేంటంటూ బేరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అసలుకే మోసం వస్తుందేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
గెలుపుపై ధీమా: ప్రజాబలంతో అత్యధిక జెడ్పీటీసీలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉంది. మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందని, జెడ్పీ పీఠం దక్కించుకోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు.
టీడీపీలో ‘జెడ్పీ’ లొల్లి
Published Sun, Jul 20 2014 2:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement