ఆధిపత్యం, వర్గ పోరు, గ్రూప్ తగాదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో.. సమస్య సమసిపోకపోగా అధికమవుతోంది. ఇటీవల భువనగిరిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే శ్రేణులు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడం.. కాంగ్రెస్ మార్క్ రాజకీయం మరోమారు బయటపడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ నేతలు ఎవరికి వారే వ్యవహరిస్తున్న తీరు.. నియోజకవర్గాల వారీగా వారిని సమన్వయం చేయడం పార్టీకి సవాల్‌గా మారింది.
సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. 2014 ఎన్నికల సమయం నాటి పరిస్థితులు, ఇప్పటి పరిణామాలు చూస్తుంటే పెద్ద తేడా లేనట్లు కనిపిస్తోంది. ఈనెల 16వ తేదీన భువనగిరిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ సలీం అహ్మద్ సమక్షంలో జరిగిన వివా దాలు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితికి అద్దంపట్టింది. శక్తి యాప్ నిర్వహణ, బూత్‌కమిటీల పనితీరును బలోపేతం చేయడం కోసం తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఏమేం చేస్తే వచ్చే ఎన్నికల్లో విజ యం సాధించడానికి వీలు కలుగుతుందన్న విషయాలను వివరించడానికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నేతలు వర్గాలుగా విడిపోయి బల ప్రదర్శనకు దిగారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , కోమటిరెడ్డి వర్గీయులుగా విడిపోయి గొడవలకు దిగడంతో పరిశీలకుని ముందే రసాభాసగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితిజిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మార్కు వర్గపోరు, గ్రూప్ తగాదాలు, అధిపత్య పోరాటాలు సమసిపోలేదు సరికదా మరింత పెరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని నియోజకవర్గాల వా రీగా ఐక్యం చేయడం సవాల్‌గా మారింది. ఇలాం టి గొడవలతోనే గత ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌తోపాటు 7అసెంబ్లీ నియోజకవర్గాలో కాం గ్రెస్ ఓటమి చవిచూసింది. గత ఎన్నికల నాటి గ్రూపు రాజకీయాలతో జరిగిన నష్టం నుంచి పా ర్టీ గుణపాఠం నేర్చుకుంటుందా? ఇదే తంతు కొ నసాగిస్తుందా అని పరిశీలకులు భావిస్తున్నారు.
నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా..
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉంది. భువనగి రి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు.
భువనగిరిలో నియోజకవర్గంలో..
భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రాజగో పాల్‌రెడ్డి వర్గీయుల మధ్యన విభేదాలున్నాయి. ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంతో అనిల్‌కుమార్‌రెడ్డి కొంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరీ ్గయులు, అనిల్‌కుమార్‌రెడ్డి వర్గీయుల మధ్యన వి భేదాలున్నాయి. సమీక్ష సమావేశంలో భువనగిరి బీబీనగర్‌కు చెందిన స్థానిక నేతలు పరస్పరం ఘర్షణకు దిగడంతో అర్ధాంతంగా నిలిచిన సమీక్ష సమావేశాన్ని చివరగా ముగించారు. అలాగే జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సర్పం చ్‌ల పోరం భువనగిరి నియోజకవర్గం కన్వీనర్ పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, అందెల లింగంయాదవ్, పంజాలరామాంజనేయలు గౌడ్‌లు ఎవరికి వారే తమ వాదనలు విన్పించి వచ్చే ఎన్నికల్లో పోటి చేయడానికి తమకుఅవకాశం ఇవ్వాలని కోరారు.
నకిరేకల్ నియోజకవర్గంలో..
కాంగ్రెస్ వర్గాలు విడిపోయి ఎవరికి వారే పోటా పోటీగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు, కొండెటే మల్లయ్య, ప్రసన్నరాజులు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్దం చేసుకుం టున్నారు. రిజర్వుడు నియోజకర్గంలో కోమటిరెడ్డి వర్గీయుడైన నియోజకవర్గం ఇంచార్జ్ చిరుమర్తి లింగయ్యకు పోటీగా ప్రసన్న రాజు, కొండేటి మల్లయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ కార్యక్రమాలతోపాటు వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అధిష్టానంఎవరికి సీటు ఇస్తుందో గాని సమీక్ష సమావేశంలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు, నాయకులు విడిపోయి తన్నుకున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో..
నియోజకవర్గ ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురైన స్రవంతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన ని ఇప్పటికే ప్రకటించడంతో ఇరువురి మధ్యన వి భేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడొకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రారంభించారు.
జనగామ నియోజకవర్గంలో..
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల మధ్యన విభేదాలు ఉన్నాయి. సమీక్ష సమావేశం రోజున జనగామకు చెందిన మాజీ మన్సిపల్‌చైర్మన్‌లు వేముల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి పొన్నాల పార్టీని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశా>రు. సమీక్ష సమావేశంలో పాల్గొనకుండానే పొన్నాల అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోటి రూపాయలతో జనగామలో వృద్ధాశ్రమం కట్టిం చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేమ మల్లేషం మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల నాటినుంచే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కేమ మల్లేషంపై మల్‌రెడ్డి రంగారెడ్డి పరిశీలకుడికి ఫిర్యాదు చేశారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో..
రిజర్వుడు నియోజకవర్గమైన తుంగతుర్తిలో 2014 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి ద యాకర్, 2009లో పోట చేసి ఓడిపోయిన మామి డి నర్సయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సి ద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల నాటికి మరికొందరు అశావాహులు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment