రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు అభివాదం చేస్తున్న అజారుద్దీన్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని డక్‌అవుట్ చేయండి.. కోమటిరెడ్డి మంచిమనిషి భారీ మెజారిటీతో గెలిపించండి.. ఆ తర్వాత నల్లగొండలో యువతతో క్రికెట్ ఆడేందుకు వస్తానని ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ సభ్యు డు, మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. మంగళవారం నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపుకోసం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అద్దంకి బైపాస్ మర్రిగూడనుంచి పెద్దగడియారం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అక్కడి నుంచి తులసీ నగర్, పాతబస్తీ, అక్కచల్మ, పూల్ మీదుగా తిరిగి వన్‌టౌన్ వరకు వేలాది మంది మైనార్టీలతో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ప్రజలనుద్దేశించి అజారుద్దీన్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గెలిస్తే నల్లగొండ మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ల పేర మైనార్టీలను మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వమే 4శాతం రిజర్వేషన్ కల్పించి మైనార్టీల కుటుంబాల్లో వెలుగు నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, చిన్న పార్టీల వల్ల అభివృద్ధి జరగదు. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ.. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ అని అలాంటి పార్టీ వల్లనే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారన్నారు. నల్లగొండతో తనకు అవినాభావ సంబంధం ఉంది.. 1976లో నల్లగొండలో క్రికెట్ ఆడేందుకు వచ్చా నని గుర్తు చేసుకున్నారు. ‘జీవితాంతం కోమటిరెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించండి.. మైనార్టీలకు అండగా ఉంటాడు.
క్రికెటర్‌గా నేను మాట ఇస్తున్నా.. కోమటిరెడ్డి పనిచేయకపోతే నన్ను నిలదీయండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తానని’ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, మోదీ ఇద్దరూ ఒక్కటే.. వారి వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచే పోటీ చేస్తారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని, అజారుద్దీన్ కేంద్ర మంత్రి అవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు హఫీజ్‌ఖాన్, వంగాల స్వావి ుగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి నరేందర్‌రెడ్డి, అమీన్ బాబా, పన్నాల గోపాల్‌రెడ్డి, ఇంతియాజ్, దుబ్బ మధు, సమీఖాద్రి, లతీఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment