గరిడేపల్లి : కల్మల్‌చెర్వులో ప్రచారంలో పాల్గొన్న శానంపూడి సైదిరెడ్డి , మఠంపల్లి : ప్రచారం నిర్వహిస్తున్న సైదిరెడ్డి సతీమణి రజితారెడ్డి
సాక్షి, గరిడేపల్లి : ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రజాసేవ కోసమే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్మల్‌చెర్వులో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాసేవే తన ధ్యేయమన్నారు. స్థానికుడైన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలందరి మధ్యలో ఉంటూ సేవ చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తాను భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు బొల్లగాని సైదులుగౌడ్, యెల్గూరి సత్యనారాయణరెడ్డి, గుండ్ల శ్రీధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అంజయ్య, కృష్ణారెడ్డి తదిరులు పాల్గొన్నారు.
సైదిరెడ్డి గెలుపునకు ప్రజలంతా సహకరించాలి
మఠంపల్లి : నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి గెలుపుకు ప్రజలంతా సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని సైదిరెడ్డి సతీమణి రజితారెడ్డి కోరారు. శుక్రవారం ఆమె పార్టీ నాయకులు, సై యూత్ సభ్యులతో కలిసి మండలంలోని బక్కమంతులగూడెం, ఎర్రగట్టు, త్రివేణినగర్‌లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మామిడి సోవమ్మ, మాజీ సర్పంచ్ సత్యావతి, కళావతి, భారతమ్మ, మామిడి శ్రీను, బోగాల వీరారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వీరస్వామిగౌడ్, విజయసింహారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించాలి
హుజూర్‌నగర్ : అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 3, 4 వార్డుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి సతీమణి రజిత నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి పిచ్చయ్య, శీలం శ్రీను, రాము, నాగయ్య, కవిత, మంగమ్మ పాల్గొన్నారు.
మండలంలో..
మండలంలోని గోపాలపురంలో శుక్రవారం టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైదిరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సురభి గురవయ్య, కాల్వ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చింతలపాలెం : టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి మహాకూటమికి బుద్ధి చెప్పాలని నిమోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువులు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment