టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ : సైదిరెడ్డి | TRS Candidate Saidi Reddy Canvass In Matampally | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ : సైదిరెడ్డి

Published Sat, Dec 1 2018 10:18 AM | Last Updated on Sat, Dec 1 2018 10:18 AM

TRS Candidate Saidi Reddy Canvass In Matampally - Sakshi

చింతలపాలెం : మాట్లాడుతున్న సైదిరెడ్డి

సాక్షి, మఠంపల్లి : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అధికారం చేపడితేనే బంగారు తెలంగాణ సాధ్యమని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పలుతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా వెనుకబడిన గిరిజన తండాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతి గిరిజన తండాను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపునకు కారుగుర్తుపై అత్య«ధికంగా ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నర్సింగ్‌ వెంకటేశ్వర్లుగౌడ్, ముడావత్‌ కొండానాయక్, కె.లక్ష్మీ వెంకటనారాయణ, మన్నెం శ్రీనివాసరెడ్డి, కృష్ణంరాజు, బ్రహ్మారెడ్డి, బాలునాయక్, నాగయ్యయాదవ్, వెంకన్న పాల్గొన్నారు.  
‘పులిచింతల’ సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా : సైదిరెడ్డి
చింతలపాలెం : పులిచింతల ముంపుబాధితుల సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకవెళ్తానని హుజూర్‌నగర్‌ నియోజకరవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నక్కగూడెం, చింత్రియాల, రేబల్లె, కొత్తూరు, తమ్మారం తదితర గ్రామాల్లో ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలు గ్రామాల్లో పులిచింతల ముంపు గ్రామాల సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయని, వాటిని ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఓడించి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక నుంచి కృష్ణాపట్టె బిడ్డలు మీ బెదిరింపులకు భయపడరని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో చాక్లానాయక్, ఉమాకాంత్, రామారావు, రంగాచారి, సైదిరెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
నేరేడుచర్ల : మండలంలోని చింతకుంట్లకు చెందిన సీపీఐ, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌ నాయకులు వంగాల వల్లపురెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైదిరెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో వంగాల భాస్కర్, సత్యంరెడ్డి, సత్యనారాయణ మూర్తి, కృష్ణాచా రి, బండి చిన్న వెంకట్రామయ్య, సుబ్బయ్య, లెనిన్, రో షయ్య, వెంకటేశ్వర్లు, దర్గారావు, నర్సయ్య పాల్గొన్నారు. 
టైలర్స్‌ సంఘం ఆధ్వర్యంలో..
మండలానికి చెందిన టైలర్స్‌ యూనియన్, ఓనర్స్, వర్కర్స్‌ అధ్యక్షుడు తాళ్ల రాము, పుల్లారావుల ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామా భరత్‌కుమార్, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైఎస్‌ చైర్మన్‌ యామిని వీరయ్య, పిడమర్తి రాజు, జగన్నాథచారి, సైదులు, గౌస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తాలు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement