saidi Reddy
-
నల్లగొండ..నెగ్గేదెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని సాగునీటి కోసం బ్యాలెట్ యుద్ధం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్‌చారి ఇలా.. ఎందులో చూసినా నల్లగొండ జిల్లాది ప్రత్యేకస్థానం. 1940లోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, 1952 తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికైన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్ భవనాన్నే ప్రారంభించారు.అలాంటి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు కమ్యూనిస్టు పార్టీ, రెండుసార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి, పీడీఎఫ్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించగా, భీంరెడ్డి నర్సింహారెడ్డి రద్దయిన మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన సూదిని జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు.సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండపై క్రమంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే నల్లగొండలో గెలుపొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2014, 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుందూరు రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.నాలుగోసారి కూడా తామే నల్లగొండలో పాగా వేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్చార్జ్గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేసిందంటూ విమర్శిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.బోణీ కొట్టేందుకు బీఆర్ఎస్బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా 2014, 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినా, ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అడ్డు కోలేకపోయింది. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్య ర్థులే విజయం సాధించారు. అదే తరహాలో ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ముందుకు సాగుతోంది.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 పథ కాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో భారీ సభ నిర్వహించడం, ఆ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల్లోనూ ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఇటీవల మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నీ తానై ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారు.మోదీ చరిష్మా, పాలకుల వైఫల్యాలే గెలిపిస్తాయంటున్న బీజేపీనల్లగొండ పార్లమెంట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు. అప్పట్లో ఓరుగంటి రాములు ఎంపీగా పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి లాంటి పెద్ద నాయకులు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం దేశంలో మోదీ చరిష్మా కొనసాగుతోంది. రామమందిర నిర్మాణం చేపట్టడం, అక్కడ తలంబ్రాల బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం హిందువుల్లో బీజేపీ వైపు మళ్లారన్న ధీమాతో బీజేపీ ఉంది.ప్రధానంగా యువత అంతా మోదీ ఆకర్షణలో ఉన్నారని, ఆ మోదీ చరి ష్మాతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజ యం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్లగొండలో ప్రచారం చేయబోతున్నారు.ముగ్గురూ కొత్త వారే..నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి ముగ్గురు కొత్త అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆయన తండ్రి, మాజీ మంత్రి జానారెడ్డి అండదండలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ కూడా కొత్త అభ్యర్థినే పోటీలోకి దింపింది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈయన కూడా ఎక్కడా పోటీ చేయలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన 2018లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ప్రభావితం చేసే అంశాలు∗ రైతులు, సాగునీరు, ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు∗ ఎంపీ సెగ్మెంట్లో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఓట్లే కీలకం∗ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు∗ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేయకపోవడం∗ నెల్లికల్లు లిఫ్ట్, బ్రాహ్మణవెల్లెంల, డిండి తదితర పెండింగ్ ప్రాజెక్టులు2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లునలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) 5,26,028 (44.73 శాతం)వేమిరెడ్డి నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 5,00,346 (42.55 శాతం)గార్లపాటి జితేంద్రకుమార్ (బీజేపీ) 52,709 (4.48 శాతం)అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు ఇలా..నియోజకవర్గం పురుషులు స్త్రీలుదేవరకొండ(ఎస్టీ) 1,31,659 1,30,392 నాగార్జునసాగర్ 1,15,710 1,20,464 మిర్యాలగూడ 1,15,543 1,20,299హుజూర్నగర్ 1,21,667 1,29,164 కోదాడ 1,19,068 1,25,878 సూర్యాపేట 1,18,770 1,24,893నల్లగొండ 1,21,079 1,27,766మొత్తం 8,43,496 8,78,856 -
ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
నల్లగొండ: తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపుతానని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి హాలియా పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మాజీ మంత్రి జానారెడ్డి చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో పేదలకు సరైన వైద్యం అందక హైదరాబాద్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంకణాల నివేదితారెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఇన్చార్జి మన్నెం రంజిత్‌యాదవ్, చెన్ను వెంకటనారాయణరెడ్డి, డాక్టర్ పానుగోతు రవికుమార్, చలమల్ల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.దాచుకోవడం, దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంపెద్దవూర: అధికారంలోకి వస్తే దాచుకోవడం, దేశాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికి ఒక్క గ్యారంటీని నెరవేర్చలేదని ఆరోపించారు. దేశంలో అవినీతిరహిత పాలన కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వారసత్వ పార్టీలని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఏరుకొండ నర్సింహ, దినేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
క్షమించండి.. బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. సైదిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇక, బీఆర్ఎస్ పని అయిపోయినట్టే’’ అంటూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్ వైరల్‌గా మారింది. హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల ముఖ్య కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక, ఈ టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఈ సందర్బంగా సైదిరెడ్డి కామెంట్స్ ఇలా ఉన్నాయి.. ‘తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నారు. ఢిల్లీకి రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. పార్టీలో చేరాలని కోరుతున్నారు. బీజేపీ చేరితే పార్లమెంట్ టికెట్ నీకే ఖరారవుతుందన్నారు. నేను ఎవరితో చెప్పలేదని, కార్యకర్తలతో మాట్లాడాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. అమిత్ షా ఆధ్వర్యంలో ఇప్పుడే ఇది పూర్తవుతుంది. ఇప్పుడు నువ్వు కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తెచ్చారు. మీరంతా నా వెంటే ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారని నేను పార్టీ మారాల్సి వచ్చింది. మీకు తెలుసు నేను బీఆర్ఎస్లో చేరినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది. ఒక్క సర్పంచ్ లేడు. నేను వచ్చాకనే 120 సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకున్నాం. యువతకు ఏమీ చేయలేకపోయానని బాధ ఉంది. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. మళ్లీ మోదీనే వస్తాడు. అప్పుడు మనం యూత్‌కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు తీసుకురావచ్చు. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నాను. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదే అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ పార్టీ వాళ్లే కోరుకుంటున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలే వెళ్లి సీఎం రేవంత్‌కు సహాయం చేసే అవకాశం ఉంది. బీజేపీలోకి నేను ఒక్కడినే వెళ్లి ఏంచేస్తాను. నాతోపాటు మీరు కూడా ఉంటే ఏదైనా చేయవచ్చు. బీజేపీలో చేరుతున్నట్టు చెప్పకపోవడం తప్పే, రాష్ట్రంలో టీడీపీ ఖతమైంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. బీజేపీకి 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్న. రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీతో మీటింగ్‌లో మాట్లాడతాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మరోసారి బరిలో సైదిరెడ్డి.. హుజూర్‌నగర్‌లో ఉత్కంఠత!
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2007లో ఏర్పడింది. 2009, 2014, 18లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణిని బరిలో దించారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె ఓటమిపాలైంది. ఈసారి జరిగే పోరు మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనుంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం అయిన నేపథ్యంలో గెలిచేందుకు ధన ప్రవాహం కొనసాగించే అవకాశం ఉంది. దీనికి తోడు అభివృద్ధి, ప్రతిపక్షాలు చేస్తున్న భూ ఆక్రమణలు కూడా భూమిక పోషించనున్నాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలు: ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి రేసులో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు ఇక్కడ రైతులతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు అధికంగా ఉంటారు. రాష్ట్రంలోనే అత్యధిక సిమెంట్ పరిశ్రమలు ఉన్న నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ ఒకటి. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో వేలాది మంది యువత ఉపాధి పొందుతున్నారు. కులం పరంగా ఓటర్లు : ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లే అధికంగా ఉంటారు. ఆ తర్వాత ఎస్టీ లంబాడీ వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి 27712 మంది, లంబాడీ 26039, గౌడ 16838, యాదవ16530, మున్నురుకాపు 13173, ముదిరాజ్ 13228, కమ్మ 11071 మంది ఉంటారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు: ఈ నియోజకవర్గం నుంచి సాగర్ ఎడమ కాలువ పయనిస్తుంది. సాగర్ ఆయకట్టు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉంటుంది. దీనికి తోడు అత్యధిక సిమెంట్ పరిశ్రమలకు అడ్డగా ఉంది. మరోవైపు కృష్ణపట్టే ప్రాంతం ఉంటుంది. ఇక రంగురాళ్లు ఎక్కువగా లభిస్తాయన్న ప్రచారం సైతం ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. చారిత్రక మఠంపల్లి స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్న ప్రాంతం. మేళ్ల చెరువులో ఉన్న శివాలయానికి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు వస్తారు. నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దులో ఉంది. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. -
హుజూర్నగర్ నియోజకవర్గం తదుపరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?
హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గంలో పిసిసి అద్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి 2018లో ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో కోదాడ నుంచి రెండుసార్లు, తదుపరి హుజూర్నగర్ నుంచి వరసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిపై 7466 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 2019లో ఉత్తం కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నిక కాగా, హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ది సైదిరెడ్డి భారీ ఆదిక్యతతో గెలిచారు. అప్పుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమి చెందారు. అంతకుముందు 2014లో ఆమె కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కోదాడలో ఓడిపోయిన తర్వాత హుజూర్‌నగర్‌లో మళ్లీ రంగంలో దిగి ఓటమి చెందారు. తెలంగాణలో 2014 ఎన్నికల తర్వాత ఉత్తం కుమార్ రెడ్డి పిసిసి అద్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అదికారంలోకి రాలేకపోయింది. 2018 సాదారణ ఎన్నికలో ఉత్తంకుమార్‌రెడ్డికి 92996 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85530 ఓట్లు వచ్చాయి. సైదిరెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2019 ఉప ఎన్నికలో సైదిరెడ్డికి 43358 ఓట్ల ఆదిక్యత వచ్చింది. సైదిరెడ్డికి 113094 ఓట్లు రాగా కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన పద్మావతికి 69737 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో ఉత్తం కుమార్ రెడ్డికి 7466 ఓట్ల మెజార్గీ రాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఐ భారీతేడాతో ఓటమి చెందడం విశేషం. ఉప ఎన్నికలో బిజెపి, టిడిపిలు డిపాజిట్లు కోల్పోయాయి. 2014లో ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో గెలిస్తే, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి గెలుపొందడం విశేషం. 2009 శాసనసభలో మహబూబ్ నగర్ జిల్లాలో దంపతుల జంట దయాకరరెడ్డి, సీతలు మక్తల్,దేవరకద్ర ల నుంచి గెలుపొందగా, 2014లో ఆ అవకాశం ఉత్తంకుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలకు దక్కింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవీ దంపతులు కూడా 1953,1962లలో ఒకేసారి గెలుపొంది శాసనభకు వెళ్లారు. 2014లో ఆ గౌరవం ఉత్తం దంపతులకు లభించింది. ఉత్తం కుమార్ రెడ్డి 2014లో రాష్ట్రపతి పాలన వచ్చేవరకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. రాజకీయాలలోకి రావడానికి ముందు ఈయన రాష్ట్రపతి భవన్లో బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పై 23924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1952 నుంచి 1972వరకు ఈ నియోజకవర్గం ఉండేది. మూడుసార్లు పిడిఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ, ఒకసారి టిఆర్ఎస్, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. హుజూర్‌నగర్‌లో రెండుసార్లు గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు కోదాడ నుంచి ఒకసారి గెలుపొందారు. ఈయన గతంలో కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. 1952లో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, కవి ముక్దుం మొహియుద్దీన్ గెలుపొందారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. రెండు స్థానాలు పిడిఎఫ్ గెలుచుకుంది. అయితే జయసూర్య మెదక్ నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికవడంతో ఏర్పడిన ఖాళీలో మొహియుద్దీన్ ఎన్నికయ్యారు. హుజూర్ నగర్ లో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బ్రాహ్మణ,బిసి,ఎస్.సి, ముస్లిం వర్గాలు ఒక్కోసారి గెలుపొందాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి vs ఎమ్మెల్యే సైదిరెడ్డి
-
మైండ్‌గేమ్‌తో బీజేపీ ఆటలు సాగవు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కరోనాను కనిపెట్టడంలో విఫలమవగా ఆ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ధీటుగా ఎదుర్కొందో దేశమంతా చూసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను కేంద్రమంత్రులందరూ పొగిడారని చెప్పారు. గుజరాత్ తరువాత తెలంగాణ మాత్రమే జీఎస్టీ అత్యధికంగా కడుతున్న రాష్ట్రమని ఎమ్మెల్యే తెలిపారు. జనాల మైండ్‌తో గేమ్ ఆడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రామ మందిరం కట్టడమే ఇష్టం లేదని.. సుప్రీంకోర్టు చెప్పేవరకు పోరాటం చేసిన నేత ఒక్కరూ బీజేపీలో లేరని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ దేవలమెంట్ పెట్టి దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తెలంగాణలో 7లక్షల 60 వేల ఉద్యోగాలు ఐటీ ఆధారితతో యువతకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను రూ.10 కోట్లు పెట్టి బయట కొన్నా ఉపయోగం లేదని చెప్పారు. కొన్ని పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలారు!.. అని తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి విరుచుకుపడ్డారు. మాఫియాను పోషించేది బీజేపీనే మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశీయ దొంగలు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సత్యహరిశ్చంద్రుడు బతికి ఉంటే వీరి మాటలు విని ఆత్మహత్య చేసుకునే వారని తెలిపారు. దేశంలో మాఫియాను పెంచి పోషించేది బీజేపీ అని, హత్యలు అత్యాచారాలు చేసిన 25 మంది మంత్రివర్గాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కిశోర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసులు ఉన్న నేతలు 176 మంది పాలకవర్గంలో కొనసాగుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసుల వల్ల గతంలో గుజరాత్ నుంచి వెలివేశారని గుర్తుచేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లధనం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని, పేదలకు ఎంతధనం పంచారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మాఫియా అనేది ఎవరో దేశ.. రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలిపారు. దేశం బయట ఉన్న డబ్బులు దేశానికి రప్పించకుండా.. దేశంలో ఉన్న డబ్బులు బయటకు తరలిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్ కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను అన్నట్లేనని ఎమ్మెల్యే కిశోర్ పేర్కొన్నారు. -
‘గవర్నర్‌పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు శోచనీయం’
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ తమిళ సైపై టీఆర్ఎస్ ఎమ్మెల్ సైదిరెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమని బీజేపీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలిగా గవర్నర్ మాట్లాడుతున్నారనడం శోచనీయమన్నారు. (గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం) ఎమ్మెల్యే సైదిరెడ్డి వెంటనే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని రావుల శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను టీఆర్ఎస్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
౩౦ ఏళ్ల కల నెరవేరింది
-
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
-
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
సాక్షి, హుజూర్నగర్: ‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడానికి తన తాయెత్తే కారణమని సదరు స్వామిజీ చెప్పడం గమనార్హం. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బెల్లి సత్తయ్య ఎన్నికల్లో తన గెలుపు కోసం ఓ స్వామిజీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన స్వామిజీతో మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సత్తయ్య ప్రత్యర్ధులైన కాంగ్రెస్ అభ్యర్ధి ఇబ్రహీం, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఏర్పుల పరమేశ్‌లను కట్టడి చేయడానికి ఒక తాయత్తు ఇస్తానని, ఆ తాయెత్తు ఉంటే గెలుపు తథ్యమని సదరు స్వామిజీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలవడానికి తాను తాయత్తు ఇచ్చానని, ఇప్పటికీ ఆ తాయెత్తు ఆయన వద్ద ఉందని చెప్పారు. తన తాయెత్తుతో గెలిచిన తర్వాత తను అడిగింది ఇవ్వాలని షరతు పెట్టారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ ఆడియోటేపుపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఈ మూఢనమ్మకాలేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని నమ్మే నేతులు ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ ఆడియోటేపులో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం.. ఆయన మెడలో తాయెత్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
ఉత్తమ్‌కు కేసీఆర్ దెబ్బ రుచి చూపించాం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన సొంత గడ్డపైనే కేసీఆర్ దెబ్బ ఏంటో రుచి చూపించాం. హుజూర్నగర్ అంటే గతంలో ఉత్తమ్ గడ్డ అనే వారు. కానీ ఇప్పుడు ఆ గడ్డపైనే టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది’అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ ఒకటో తేదీన మంత్రి కేటీఆర్ హుజూర్నగర్ నియోజకవర్గం పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచిన సైదిరెడ్డి బుధవారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో పాటు పలువురు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతోపాటు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సైదిరెడ్డి నివాళి అరి్పంచారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌గా జీవన్‌రెడ్డి శాసనసభ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా ఆర్మూరు శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీవన్‌రెడ్డిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, పార్టీ నేతలు అభినందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు ఆర్మూరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. -
కేటీఆర్‌ను కలసిన సైదిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేసి విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నేతలతో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు ఉన్నారు. -
హుజూర్‌నగర్‌కు కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి : కారుకే జై హుజూర్!) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం. ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం, ప్రజా దర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం’ అన్నారు. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందిన సంగతి తెలిసిందే. -
కారుకే జై హుజూర్!
సాక్షి, హైదరాబాద్ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్నగర్ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ తొలిసారిగా కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్ సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్‌కు 885 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని రౌండ్లలో గులాబీ హవా... కౌంటింగ్ మొదలైన తర్వాత ఒకటో రౌండ్ నుంచి చివరిదైన 22వ రౌండ్ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్‌పై హుజూర్నగర్ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్‌కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ‘చే’జారిన కీలక స్థానం హుజూర్నగర్ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌లు ఉన్నారు. ఇది హుజూర్నగర్ ప్రజల విజయం అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్నగర్ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్‌లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్‌కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి రీపోలింగ్ నిర్వహించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్‌తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్‌ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం. – నలమాద పద్మావతిరెడ్డి -
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ, టీడీపీ అడ్రస్ లేకుండా పోయాయి. హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్రలొనే అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ట్రక్ సింబల్.. కారు గుర్తును పోలివుండటంతో తాను ఓడిపోయానని సైదిరెడ్డి అప్పట్లో వాపోయారు. ఉప ఎన్నికల ఫలితంతో ఆయన వాదనలో వాస్తముందని తేలింది. -
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం
-
కారు జోరు.. రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కారు జోరు చూపించింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టితో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆదిపత్యంలో దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కు మొజార్టీ పెంచుకుంటూ.. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ, బీజేపీ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇదిలా ఉంటే.. హుజూర్‌నగర్‌లో గెలిచి సైదిరెడ్డి రికార్డ్ బ్రేక్ చేశారు.ఆయన సాధించిన మెజార్టీ ఇంతవరకూ హుజూర్నగర్ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ సాధించలేదు. ఇప్పటి వరకూ హుజూర్‌నగర్‌లో 29,194 ఓట్లు మెజార్టీ ఉంది. అయితే సైదిరెడ్డి ఏకంగా 43,624 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.ఈనెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి ఉత్తమ్‌రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. -
ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
హుజూర్నగర్ ఉప ఎన్నిక: ఓటు వేసిన సైదిరెడ్డి
-
హుజూర్‌నగర్‌లో ఎవరి బలమెంత..!
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్‌నగర్‌పై నెలకొంది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గెలుపెవరిదని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 21) రోజున పోలింగ్ జరుగనుంది. 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్నగర్ ముఖచిత్రం నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్, గరిడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలతో పాటు హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలుగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 3,21,142 మంది జనాభా ఉండగా 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1,20,427 మంది కాగా పురుష ఓటర్ల సంఖ్య 1,16,415 మందిగా ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లదే ఆధిక్యం. ఇక్కడ పురుషులకంటే మహిళా ఓటర్లు 4012 మంది ఎక్కువగా ఉన్నారు. 2009, 2014, 2018 వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి పై 7466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తంకుమార్ రెడ్డి కి 92,996 ఓట్లు రాగా టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి 85,530, సీపీఎం కు 2121, బీజేపీ కి 1555, స్వతంత్ర టక్కు గుర్తు అభ్యర్థికి 4944 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం 85.96గా నమోదు కాగా కాంగ్రెస్ కు 48%, టీఆర్ఎస్ 43.56 %, సీపీఎం 1%, బీజేపీకి 0.83% ఓట్లు వచ్చాయి. అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఉత్తమ్ ఎంపీగా గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నియోజవర్గంలో ఎస్టీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా 29వేలు ఉండగా తర్వాత స్థానంలో రెడ్లు 27వేల మంది ఉన్నారు. ఎస్సీలు 21 వేలు, మాల 16వేలు, మున్నూరు కాపు 14వేలు, యాదవులు 16వేలు, గౌడ్లు 16వేలు, ముదిరాజ్ లు 13వేలు, పెరిక 7000, వైశ్యులు 8వేలు, కమ్మ 6వేలు, వెలమలు 2000, బ్రాహ్మణులు, రజకులు, నాయి బ్రాహ్మణ కమ్మరి, కుమ్మరి మంగలి అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 76 మంది నామినేషన్లు వేయగా చివరికి 28 మంది అభ్యర్థులు మిగిలారు. ఉప ఎన్నికల్లో అత్యధికంగా 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తమ అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో సీపీఎం స్వతంత్ర అభ్యర్థి సాంబశివ గౌడ్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఐ తొలుత టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకుంది. పోటీలో కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, టీడీపీ, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ కాంగ్రెస్-టిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బరిలో ఉన్నారు. హుజూర్‌నగరగ్ కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా ఉత్తమ్ తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. హుజూర్‌నగర్‌లో అభ్యర్థుల బలాబలాలు: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలాలు: పార్టీకి బలమైన క్యాడర్ ఉండటం, ఉత్తత్‌కుమార్ రెడ్డి గతంలో మంత్రిగా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం. బలహీనతలు: కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం. టీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సైదిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటివరకు హుజూర్‌నగర్‌లో ఖాతా తెరవని టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి బలాలు: అధికారంలో ఉండటం, అభ్యర్థి గతంలో ఓడిపోయాడనే సానుభూతి. బలహీనత: అధికారంలో ఉన్న టీఆర్ఎస్ హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేయలేదనే అప్రతిష్ట. బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో 1555 ఓట్లు సాధించగా, ఎంపీ ఎన్నికల్లో 3 వేల ఓట్ల సాధించింది. బీసీ మంత్రంతో ఉపఎన్నికలో బరిలో దిగిన బీజేపీ ఎన్ని ఓట్లు సాధిస్తుందనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈసారి 5 నుండి 10 వేల ఓట్లు సాధింస్తామని బీజేపీ అంచనాలు వేసుకుంది. టీడీపీకి బలమైన క్యాడర్ ఉండగా తన ఓట్లు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. 5 నుంచి 10 వేల ఓట్లు సాధించే దిశగా ప్రయత్నం చేస్తుంది. -
‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’
సాక్షి, హుజూర్నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ గడప గడపకు తిరిగి ఓట్లడిగామని టీఆర్ఎస్ హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఊడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డి పీసీసీ పదవి కోసం రోడ్ల మీద పడి కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి హుజూర్నగర్ ప్రజలను రెచ్చగొట్టేలా, అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన సైదిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని హుజూర్నగర్ ప్రజలంతా మనసారా కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్, ప్రభుత్వ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి.. ‘ఇది టీఆర్ఎస్ అభివృద్ధికి అభివృద్ధి నిరోధక ఉత్తమ్ కుటుంబానికి వచ్చిన ఉప ఎన్నిక. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా. ప్రజలంతా గమనిస్తున్నరు. ఉత్తమ్ అహంకారానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నరు. పద్మావతి రెడ్డికి ఘోర పరాజయం తప్పదు. హుజూర్నగర్ అభివృద్ధి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు హుజూర్నగర్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నరు. ఓటమి భయంతో ఉత్తమ్ కాంగ్రెస్ లీడర్లందరినీ ఇక్కడకు రప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. నా పై ఉత్తమ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే ఉత్తమ్ భేషరతుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి’అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. -
‘ఆయన.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీ’
సాక్షి, హుజూర్నగర్ : హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులెవరు గెలిచినా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి బినామీ అని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి కలెక్టర్ కార్యాలయానికి స్థలాలు అమ్మారని ఆరోపించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిస్తే ఉత్తమ్‌కు తప్ప హుజూర్నగర్ ప్రజలకెలాంటి ప్రయోజనం ఉండదని, ఉత్తమ్‌కుఎ ఆమె జీ హుజూర్ అంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మణ్ గరిడేపల్లి మండలంలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సైదిరెడ్డి గెలిస్తే 107వ ఎమ్మెల్యే అవుతాడు తప్ప ప్రయోజనం లేదు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ కొలువుల ఊసే లేదు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సుమారు 25 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాకూడా యువతకు ఉద్యోగాలు లేవు. ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఉత్తమ్, కేసీఆర్, కేటీఆర్ ఉదయం తిట్టుకుంటారు. రాత్రి వేళల్లో మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో 50 వేల మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేసీఆర్ అగ్గితో గోక్కున్నావు. నీ చేతులు, ఒళ్లు కాలడం పక్క’అని లక్ష్మణ్ అన్నారు. -
హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్
సాక్షి, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి గురువారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ నెల 30న నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో 'హలో సర్పంచ్.. చలో హుజుర్నగర్' పేరుతో ప్రధాన పార్టీలకు రాష్ట్ర సర్పంచుల సంఘం ...ప్రధాన పార్టీలకు పోటీగా బరిలోకి దిగబోతోంది. హుజుర్ నగర్ స్థానం నుంచి తాము పోటీ చేయనున్నట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా... ఉప ఎన్నికల బరిలో మొత్తం 251మంది సర్పంచులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 17మంది పోటీ చేశారు. అందరికీ కలిపి 1,92,844 ఓట్లు పడ్డాయి. అయితే అన్ని పార్టీలో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి తమ సత్తా తేల్చుకునేందుకు సై అంటున్నా...ప్రధాన పార్టీల మధ్యనే గెలుపు ఓటములు ఉండనున్నాయి. కాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర పెంపు కోసం నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 236మంది రైతులు నామినేషన్లు వేశారు. కాగా ఇలా మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో తెలంగాణలో ఇదే మొదటిసారి కాదు. 1996 ఎన్నికల్లో తమ ప్రాంతానికి సాగు, తాగు నీటిని కల్పించాలని జలసాధన సమితి నేతృత్వంలో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఏకంగా 515 మంది నామినేషన్లు వేశారు. -
ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా వెళ్తున్నాయి. షెడ్యూల్ విడుదలైన తర్వా త తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంతో ఒక సారి నియోజకవర్గాన్ని చుట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతిని ప్రకటించిన ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విపక్షాల మద్దతు కోసం యత్నిస్తున్నారు. ఏఐసీసీ నుంచి అధికారింగా పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె ప్రచారంలో దిగనున్నారు. నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మోగిన టీఆర్ఎస్ ప్రచార శంఖారావం.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచార శంఖారావం మోగించారు. పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఘాటుగా విమర్శలు చేశారు. షెడ్యూల్ వి డుదల, సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించక ముం దే గత నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించా రు. పనిలో పనిగా పార్టీలో భారీగా చేరికలతో జోష్ పెంచారు. ఈ కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై కేడర్‌లో ఉత్సాహం పెంచారు. మళ్లీ సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించడంతో శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితితో గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీఆర్ఎస్ ఈ సారి తమదే విజయమని ధీమాగా ఉంది. గతంలో ఓటమి చెందారన్న సానుభూతి ఈ సారి తమ పార్టీ అభ్యర్థికి ఉపకరించి విజయం దక్కుతుందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మద్దతు కూడగట్టుకోవాలని.. కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించినా ఈ విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆపార్టీలో దుమారం లేపాయి. రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారికంగా మళ్లీ పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రచార జోరు పెంచాలని ఆపార్టీ భావిస్తోంది. ఉత్తమ్ గత పదిహేను రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం కూడా నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో విపక్షాల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీపీఐ, సీపీఎం నేతలతో ఇప్పటికే ఉత్తమ్ మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంను ఉత్తమ్ కలిసి హుజూర్నగర్ ఎన్నికపై చర్చించారు. కలిసి వచ్చే పార్టీలతో వెళితే ఎంతోకొంత బలం పెరుగుతుందని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌తో ఎవరు కలిసి వస్తారు.. ప్రతి పక్షాలు పార్టీలు ఎవరెవరిని బరిలో దింపనున్నాయో మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది. ఎలా ముందుకెళ్లాలని.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములు ఏపార్టీవని రాష్ట్ర స్థాయిలో జోరుగా చర్చసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆలోచిస్తున్నాయి. ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం, ఆయన టీపీసీసీ చీఫ్‌గా ఉండడంతో ఈ స్థానం ఈ సారి తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మండలానికి ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను ఇన్చార్జిగా పెట్టాలని ఇప్పటికే టీఆర్ఎస్ నిర్ణయించింది. నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మొత్తంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి భుజానకెత్తుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని ఇక విజయం తమదేనని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. హుజూర్నగ్ ఉప ఎన్నికతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. ‘ఉత్తమ్, జానా.. నేను కలిసిపోయామని, మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు’ అని ఇటీవల జిల్లా పర్యటనలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలపై.. ఉత్తమ్‌కు ఉమ్మడి జిల్లా నేతలు బాసటగా నిలిచారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లా నేతల ఐక్యత, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆపార్టీ›నేతలు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలను ఈ ఎన్నికల్లో ప్రచారంలోకి దింపాలని ఏఐసీసీ సూచనలతో ఉత్తమ్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక టీడీపీ, బీజేపీలు పోటీలో ఉంటాయా..? ఎటు వైపు వెళ్తాయన్నది తేలాల్సి ఉంది. పోలింగ్‌కు ఇంకా 28 రోజుల సమయం ఉంది. వచ్చే నెల 19న ప్రచారం ముగుస్తుంది. ఈ తక్కువ సమయంలోనే ప్రజల నాడి పట్టుకొని గెలుపు తీరం చేరాలని ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పై ఎత్తుల్లో మునిగారు. ముహూర్తం చూసుకొని రెండు మూడు రోజుల్లో నామినేషన్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం టీఆర్ఎస్ హుజూర్నగర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఫాం అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు నియోజకవర్గంలో చేపట్టదలచిన ప్రచారంపై పలు సూచనలు చేశారు. భారీ మెజార్టీతో గెలిచిరావాలని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా దక్కవద్దన్నారు. రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ వేయనున్నట్లు సైదిరెడ్డి సాక్షికి తెలిపారు.