
ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి(ఎడమ), సంపత్‌కుమార్ (కుడి)
సాక్షి, హైదరాబాద్ : తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌లు రాష్ట్ర డీజీపీను కోరారు. గురువారం డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆయన్ను కలుసుకున్నారు. హైకోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పునిచ్చిందని, ఉపసంహరించిన గన్‌మెన్లను తిరిగి ఇవ్వాలని కోరారు.
కోర్టు తీర్పు తర్వాత సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా పోలీసులు కార్యకర్తలను టార్గెట్ చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు ఆపకపోతే జంతర్‌మంతర్ వద్ద రెండు, మూడు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఓ ఎమ్మెల్యేకు కల్పించే సదుపాయాలను ప్రభుత్వం తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించడంపై సెక్యూరిటీ కమిటీకి నివేదిస్తానని డీజీపీ చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్‌లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment