
ఉత్తమ్ నాయకత్వంలో పోటీ చేయను
పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న సీనియర్లను గౌరవించుకోవాలనే బుద్ధి, ఇంగిత జ్ఞానం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న సీనియర్లను గౌరవించుకోవాలనే బుద్ధి, ఇంగిత జ్ఞానం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ నాయకత్వంలో పార్టీకి ఐదారు సీట్లకు మించి రావన్నారు. పొన్నాల లక్ష్మయ్యకంటే ఉత్తమ్ నాయకత్వం అధ్వాన్నమన్నారు.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వల్ల పార్టీ గత ఎన్నికల్లో నష్టపోయిందని కుంతియా వ్యాఖ్యా నించారని, కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడైన ఉత్తమ్‌ను చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓట్లేస్తారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తమలాంటి సీనియర్లను పార్టీ నుంచి పంపిస్తే ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలో ఉత్తమ్ ఉన్నారన్నారు. జీహెచ్‌ఎంసీ, రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఉత్తమ్ అసమర్థత కారణమన్నారు. తాము పార్టీ వీడతామని వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.