టీఆర్‌ఎస్‌పై యుద్ధమే
సీఎల్పీ నేత కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: హామీల అమలులో వైఫల్యం, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వంపై శాసన సభలో యుద్ధం చేస్తామని సీఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చ రించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయకపోవడం, కేంద్రం నుంచి వచ్చిన 790 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని దారి మళ్లించడం వల్ల రైతాం గానికి తీవ్ర ఇబ్బందులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకిగా వ్యవహ రిస్తున్నారని వ్యాఖ్యానించారు.
విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, దళితు లకు మూడెకరాల భూమిని పంపిణీ చేయడం లేదని ఆయన విమర్శించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వ కుండా ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో పెద్ద కుట్ర జరుగుతున్నదని అన్నారు.