నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీలోని అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన రెండు మూడు రోజుల్లోనే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. మొదట మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్‌తో పాటు ఐదుగురు కౌన్సిలర్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు.
తాజాగా బుధవారం మరో ఇద్దరు కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, సమి కాంగ్రెస్‌లో చేరగా కోమటిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్లు కూడా పార్టీ మారడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. నీలగిరి మున్సిపాలిటీలో మున్ముందు కూడా వలసల పరంపర కొనసాగే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్ ఉన్నారు.
నేడో, రేపో బీజేపీ నాయకులు!
నల్లగొండలో బీజేపీకి చెందిన దాదాపు పది మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో మాజీ కౌన్సి లర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, ఒకరి ద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నట్టు సమాచారం. వీరంతా నేడో రేపో కాంగ్రెస్‌లోకి రానున్నట్టు తెలుస్తోంది. వీరు ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మంతనాలు జరిపినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment