నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 21 లేదా 22న ఆయన బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. చెరుకు సుధాకర్‌ను బీఆర్‌ఎస్‌లోకి రావాలని మంత్రి జగదీష్‌రెడ్డి గురువారం సాయంత్రం ఆయనను కలిసి చర్చలు జరిపారు. అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్‌రావుతో ఫోన్‌లో మాట్లాడించారు.
ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ పార్టీలోనే ప్రాధాన్యం దక్కుతుందని వారు చేసిన సూచన మేరకు చెరుకు సుధాకర్ గులాబీ కండువా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్‌లో వేముల వీరేశంను కాంగ్రెస్‌లోకి తీసుకురావడం, పోటీలో ఉంచడం, బీసీలకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని ప్రకటించిన ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తాను బీఆర్‌ఎస్ లోకి వెళ్లి కాంగ్రెస్ నేతల తీరుపై పోరాటం చేయాలని భావిస్తున్నట్లు సుధాకర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నల్లగొండలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తన శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ నెల 21 లేదా 22వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment