సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్‌నాథ్ షిండే రేవంత్‌రెడ్డినే అవ్వొచ్చని అన్నారు. తెలంగాణ ప్రజలు మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్‌ఎస్ మాత్రమేనని తెలిపారు. ఆయన బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, చాలా చోట్ల బీఆర్ఎస్‌పై గెల్చిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెల్చారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిలింది చాలా చిన్న దెబ్బ మాత్రమేనని, అయినా ప్రజులు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. చాలా స్వల్ప మెజార్టీతో 14 స్థానాలను కోల్పోయామని అన్నారు. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
గతంలో కరీంనగర్ పార్లమెంట్‌లో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్ అని చెప్పారు. 2009లో అల్గనూరులో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు, బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకట్ రెడ్డి అన్నరని గుర్తుచేశారు. దాన్నే తాను చెప్పుకొచ్చానని అన్నారు. వంద అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయాలంటారు.. అలా అబద్ధాలను నమ్ముకునే రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్లవన్నీ 420 హామీలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవముందా అని అడిగితే రేవంతేమన్నాడు? అదేం ఉంది అన్నారు. ఇప్పుడు తెలుస్తోంది అనుభవం ఎంత అవసరమో? అని కేటీఆర్ మండిపడ్డారు.
రైతుబంధు పేరు మార్చి రైతుభరోసా అని రేవంత్‌రెడ్డి దావోస్‌లో చెప్పారని విర్శించారు. మరి రైతుబంధు వచ్చిందా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రైతుబంధు పడలేదంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి రైతుబంధు రాని రైతులు ఇప్పుడు ఆలోచించాలి. వారిని చెప్పుతోని కొట్టాలా? లేదా ఓటుతోని కొట్టాలా అనేది ఆలోచన చేయాలన్నారు.
చదవండి: ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు!
Comments
Please login to add a commentAdd a comment