ఫాంహౌస్‌లో ఉంటే కెసీఆర్‌కు సమస్యలు ఎలా తెలుస్తాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. తీవ్రమైన కరువుతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, ప్రభుత్వం నుంచి రుణమాఫీ అందకపోవడం వంటివాటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమరిశంచారు. వెంటనే రుణమాఫీని ఒకేసారి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలకు నీరందకుండా కష్ణా ట్రిబ్యునల్ నిర్ణయం బాధాకరమని వెంకట రెడ్డి అన్నారు.