
టీఆర్‌ఎస్ దౌర్జన్యాలపై సభలో నిలదీస్తా
టీఆర్‌ఎస్ నాయకుల దౌర్జన్యాలు, దందాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నీలదీస్తామని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ రూరల్: టీఆర్‌ఎస్ నాయకుల దౌర్జన్యాలు, దందాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నీలదీస్తామని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంతోపాటు, ఇసుక దందాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులను నిరసిస్తూ జాతీయ రహదారిపై లక్ష మందితో ధర్నా చేస్తామన్నారు.
ఆషామాషీ తెలంగాణ కాదు... అభివృద్ధి అంటూ సీఎం ఓ పక్క ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ... మరో పక్క యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో కిందిస్థాయి టీఆర్‌ఎస్ నాయకులు మాత్రం దాడులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.