వాళ్లు మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా | Komati Reddy Venkata Reddy Reddy Challenges Gutta sukhendar | Sakshi
Sakshi News home page

వాళ్లు మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా

Published Tue, Jun 14 2016 1:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Komati Reddy Venkata Reddy Reddy Challenges Gutta sukhendar

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు.

 

విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ వీడిన గుత్తా, భాస్కర్ రావులు స్వప్రయోజనాలకోసమే పార్టీ వీడారన్నారు. పార్టీలో అంతర్గత కలహాల వల్లే పార్టీ వీడానని గుత్తా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నైతిక విలువలు ఉంటే వెంటనే గుతా పదవికి రాజీనామా చేయాలన్నారు. గుత్తా పార్టీ వీడినందుకు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అధిష్టానం ఆదిశిస్తే నల్గొండ ఎంపీగా పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుస్తానని అని చెప్పాడు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement