
సాక్షి, నల్లగొండ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్‌ఎస్ సమాన దూరం పాటిస్తుందని ఆ పార్టీ నేత, లోక్‌సభ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఆయన దుష్టపాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుత్తా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్న విషయాన్ని గుత్తా గుర్తు చేశారు. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఏపీ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.