
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన ప్రక్రియ పార్టీలో చిచ్చు రాజేస్తుంది. ఇప్పటికే పదవి కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడి, జగ్గారెడ్డి తదితరులు నేడో, రేపో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇస్తే.. తాము పార్టీలో ఉండలేమని కొందరు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment