సిగ్గుపడే పరిస్థితి తెచ్చారు..
సీఎం కిరణ్, చంద్రబాబులపై కోమటిరెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆదర్శంగా నిలవాల్సిన సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలంగాణ విషయంలో తమ వైఖరితో నాయకులమని చెప్పుకోవటానికే సిగ్గుపడే పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ముందు చెప్పిన మాటను ఇప్పుడు మార్చి గందరగోళం సృష్టిస్తున్నార ని విమర్శించారు. బిల్లుపై చర్చలో గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘‘సీఎం సభలో మాట్లాడిన విషయాల్లో ఎన్నో తప్పులున్నారుు.
ఆయన పదవికి రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుంది. చిత్తూరుకు మంచినీళ్ల కోసం రూ. వేల కోట్లు ఇచ్చిన ఆయనకు నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య కనిపించలేదా? యువకుల బలిదానాలను టీడీపీ జోక్‌గా తీసుకుంటోంది. బాబు నాయకత్వంలో కొనసాగుతున్నందుకు ఆ పార్టీ తెలంగాణ నేతలు సిగ్గుపడాలి’’ అని అన్నారు.