
నల్లగొండ: రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, ఈసారి ఎవరు సీఎం అయినా తాను ముఖ్య మైన పదవిలో ఉంటానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి ఇదే తన చివరి పోటీ అని, వచ్చేసారి పోటీచేస్తే పార్లమెంట్‌కేనని చెప్పారు. కేసీఆర్ తనను ఓడించేందుకు చూస్తున్నారని, అది ఆయన వల్ల కాదని, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌వైపే ఉన్నారన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరి ష్కారం కోసం నల్లగొండ నియోజకవర్గ కేంద్రం, హైదరాబాద్‌లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటిలో ఐదుగురు 24 గంటల పాటు అం దుబాటులో ఉంటారన్నారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు వైద్యం, ఉన్నత చదువుల విషయంలో కాల్‌సెంటర్ తగిన సలహాలు ఇస్తుందన్నారు.