
సాక్షి, హైదరాబాద్: తనకు ప్రాణహాని ఉందని ఓవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తుండగానే ఆయన గన్‌మెన్‌ను తొలగించడం దారుణమని, ఇది కక్షసాధింపు చర్యేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కోమటిరెడ్డికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
శాసనసభలో జరిగిన ఉదంతానికి సంబంధించి వీడియో ఫుటేజీ అడిగి పక్షం రోజులు కావస్తున్నా ఇవ్వడం లేదని, ప్రభుత్వానికి ఉన్న భయమేంటో స్పష్టం చేయాలని అన్నారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా కొప్పుల రాజు చాలా క్రియాశీలకంగా పనిచేశారని, కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కార్యాలయంలో ఆయన నియామకం సంతోషకరమన్నారు.