పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క
వరంగల్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట టీఆర్‌ఎస్ నేతలు అవినీతికి పాల్ప డుతున్నారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాం గ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 36 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరిట రూ.1.50 లక్షల కోట్లకు పెంచడం వెనుక పెద్ద స్కాం దాగి ఉందన్నారు.
కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపిం చారు. రీ డిజైన్ పేరుతో కంతనపల్లి ప్రాజెక్టును పెం డింగ్‌లో పెట్టిందన్నారు. గడిచిన రెండేళ్లలో దేవాదుల రెండు, మూడో దశల పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
రీ డిజైన్ పేరిట టీఆర్‌ఎస్ అవినీతి
Published Fri, Jun 24 2016 3:54 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement