స్కీములా.. స్కాములా..?
డిజైన్‌తో వేల కోట్లు దోచుకుంటున్న ప్రభుత్వం: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీములన్నీ.. స్కాములుగా మారాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. గురువారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు, మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.83 వేల కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.43 వేల కోట్లు, డిండికి రూ.10 వేల కోట్లు కేటాయింపులు చేశారనీ, ఇవన్నీ దోచుకోవడానికేనని, ఆ నలుగురు బాగుపడడానికేనని పరోక్షంగా సీఎం కేసీఆర్ కుటుంబంపై వ్యాఖ్యానించారు. మాజీమంత్రి, కాంగ్రెస్ ఖమ్మం జిల్లా పరిశీలకులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ సీజన్‌లో సాగు అవసరాలు తీర్చకుండా, రైతులను పట్టించుకోకుండా హరితహారం పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.