'స్టీఫెన్సన్ను కూడా అరెస్టు చేయాలి' | acb should arrest steafenson says bhatti vikramarka | Sakshi
Sakshi News home page

'స్టీఫెన్సన్ను కూడా అరెస్టు చేయాలి'

Published Sun, Jun 21 2015 4:43 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ఆదివారం గాంధీభవన్ లో ఏర్పాటు సమావేశానికి హాజరైన కార్యకర్తలు. ఇన్ సెట్: సభను ఉద్దేశించి మాట్లాడుతున్న భట్టీ విక్రమార్క - Sakshi

ఆదివారం గాంధీభవన్ లో ఏర్పాటు సమావేశానికి హాజరైన కార్యకర్తలు. ఇన్ సెట్: సభను ఉద్దేశించి మాట్లాడుతున్న భట్టీ విక్రమార్క

హైదరాబాద్: లంచం ఇవ్వడంతోపాటు తీసుకోవడం కూడా నేరమేనని, ఓటుకు ఓట్లు కేసులో ముడుపులు ఇవ్వజూపిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితోపాటు తీసుకోవడానికి సిద్ధమైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కూడా ఏసీబీ అరెస్టు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

ఆదివారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావులు ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 'ఇద్దరు చంద్రులూ ప్రజల అవసరాలను పక్కకుపెట్టి వ్యక్తిగత పంతాలకు పోతున్నారు' అని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement