రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నార్కట్‌పల్లి: త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టుల ను భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రా హ్మణవెల్లంల గ్రామంలో నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో ఆయన పాల్గొ ని విద్యార్థులకు నోట్‌బుక్స్, యూని ఫాం అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. బాత్‌రూమ్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.600 కోట్లు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పా రు. నాలుగు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల–ఉదయ సముద్రం ప్రాజెక్టులో నీళ్లు నింపి డిసెంబర్‌లోపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనాదీప్తి, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ బీమన్న, డీఈ మహేశ్, ఉదయ సముద్రం ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment