పట్టు వ్రస్తాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
బంగారు బోనం సమర్పించిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ
అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చారిత్రక నేపథ్యం కలిగిన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 116వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకురాగా.. యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల నాట్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి దేవీ మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమరి్పంచారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. కాగా, ఉదయం 10 గంటల అనంతరం అమ్మవారి ఆలయానికి వీఐపీల తాకిడి ప్రారంభమైంది. వీరి రాక అధికం కావడంతో బోనం ఎత్తుకున్న మహిళలు కాస్త అసౌకర్యానికి గురవ్వాల్సి వచి్చంది.
ఇక సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచి్చంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమరి్పంచారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, కె.లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకటరమణారెడ్డి, రాజ్‌ఠాకూర్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచిన మంత్రి
చార్మినార్ (హైదరాబాద్): భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారని.. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ప్రభుత్వం తరఫున చారి్మనార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలసి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కాగా, అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామ న్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరేనని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment