Laldarwaja Simhawahini Mahankali
-
వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చారిత్రక నేపథ్యం కలిగిన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 116వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకురాగా.. యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల నాట్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి దేవీ మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమరి్పంచారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. కాగా, ఉదయం 10 గంటల అనంతరం అమ్మవారి ఆలయానికి వీఐపీల తాకిడి ప్రారంభమైంది. వీరి రాక అధికం కావడంతో బోనం ఎత్తుకున్న మహిళలు కాస్త అసౌకర్యానికి గురవ్వాల్సి వచి్చంది.ఇక సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచి్చంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమరి్పంచారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, కె.లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకటరమణారెడ్డి, రాజ్‌ఠాకూర్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలిమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిభాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచిన మంత్రిచార్మినార్ (హైదరాబాద్): భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారని.. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ప్రభుత్వం తరఫున చారి్మనార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలసి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కాగా, అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామ న్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరేనని గుర్తు చేశారు. -
పాతబస్తీలో ఘనంగా బోనాలు
సాక్షి, హైదరాబాద్: డప్పు వాయిద్యాలు.. యువకుల కేరింతలు.. పోతరాజుల నృత్యాలు.. అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు.. ఆడపడుచుల బోనాలు.. అమ్మవారికి తొట్టెల సమర్పణ తదితర కార్యక్రమాల మధ్య పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర కన్నుల పండువగా జరిగింది. భక్తులు తెల్లవారుజామునే లాల్‌దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. అలాగే పాతబస్తీలోని ఇతర మహంకాళి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పటిష్ట భద్రత మధ్య... బోనాల జాతర ఉత్సవాలకు దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దక్షిణ మండలం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ బోనాల జాతర వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలను సమర్పించారు. నేడు సామూహిక ఘటాల ఊరేగింపు... ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు బోనాలు పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాతబస్తీ బోనాలు ఉత్సవంలో భాగంగా లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ఆమె సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. -
వైభవంగా లాల్ దర్వాజా బోనాలు
-
అమ్మ సేవలో..
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం బంగారు బోనం సమర్పించారు. గత వారం జరిగిన బోనాల పండుగకు ఆమె చైనాలో జరుగుతున్న పోటీల కారణంగా హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో ఆదివారం మారుబోనం ఉత్సవంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సింధు ఆలయానికి విచ్చేశారు. సంప్రదాయ వస్త్రాధారణతో వచ్చిన ఆమెకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. లాల్‌దర్వాజా అమ్మవారు తన ఇష్టదైవంగా చెప్పారు. ఏటా బోనాల జాతరకు వస్తుంటానని, అమ్మ దీవెనతోనే తాను అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్టు చెప్పారు. త్వరలో జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి తిరిగి అమ్మవారిని దర్శించుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పి.వై.కైలాష్ వీర్, ప్రతినిధులు కె.వెంకటేష్, జి.మహేష్ గౌడ్, బి.బల్వంత్ యాదవ్, మాణిక్ ప్రభు గౌడ్, తిరుపతి నర్సింగరావు, విష్ణు గౌడ్, కాశీనాథ్ గౌడ్, రాజ్‌కుమార్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పాతబస్తీలో బోనాలు ప్రారంభం
పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. మరోవైపు ఆషాఢ బోనాలకు పాతబస్తీలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, మీరాలంమండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్‌షాహీ శీతల్‌మాత మహంకాళి, గౌలిపురా నల్లపోచమ్మ, అక్కన్నమాదన్న మహంకాళి తదితర ఆలయాల్లో నేడు బోనాల వేడుకలు జరుగుతున్నాయి. అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలూ కలుగకుండా సకల ఏర్పాట్లూ చేసినట్టు మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్‌తివారీ చెప్పారు. ఈ ఉత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఉపముఖ్యమంత్రి రాజనర్సిం హతోపాటు తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారి ఆలయాలను సందర్శిస్తారన్నారు. మంత్రి గీతారెడ్డి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కాగా, బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ఆలయాల వద్ద అధికారులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని రాకేష్ తివారీ ఆరోపించారు.