Bonala celebrations
-
ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీలో ఈదమ్మ ఆలయంలో బోనాల వేడుకలు (ఫొటోలు)
-
వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చారిత్రక నేపథ్యం కలిగిన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 116వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకురాగా.. యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల నాట్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి దేవీ మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమరి్పంచారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. కాగా, ఉదయం 10 గంటల అనంతరం అమ్మవారి ఆలయానికి వీఐపీల తాకిడి ప్రారంభమైంది. వీరి రాక అధికం కావడంతో బోనం ఎత్తుకున్న మహిళలు కాస్త అసౌకర్యానికి గురవ్వాల్సి వచి్చంది.ఇక సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఎదురు చూడాల్సి వచి్చంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమరి్పంచారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, కె.లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకటరమణారెడ్డి, రాజ్‌ఠాకూర్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలిమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిభాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచిన మంత్రిచార్మినార్ (హైదరాబాద్): భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉంటున్నారని.. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ప్రభుత్వం తరఫున చారి్మనార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలసి పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కాగా, అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డెజైన్‌తో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామ న్నారు. మేడిగడ్డ బరాజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరేనని గుర్తు చేశారు. -
బోనాల పండుగ 2024 ప్రాముఖ్యత, ఆసక్తికర సంగతులు
తెలంగాణాలో అత్యంత ఘనంగా, వైభవంగా జరిగే బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండగ పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలకు పూజలు, బోనం, రంగం, భవిష్యవాణి.. ఇలా నెల రోజుల పాటు ఈ సందడి కొనసాగుతుంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజుఈ బోనాల ఉత్సవం షురు అవుతుంది. తరువాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంల ఒక్కో గుడిలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి ఎందుకని బోనాల పండుగ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెలంతా తెలంగాణా ఆడబడుచులు ఉత్సాహంగా గడుపుతారు. డప్పులు, వాయిద్యాలు పోతరాజు నృత్యం మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మూడు ఆదివారాల ఉత్సవం తర్వాత నాలుగో ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున రంగం, ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. ఘటం చివరి ఊరేగింపు. దేవతలా అలంకరించబడిన కుండను పూజారి తీసుకువెళ్లి పవిత్రనీటిలో నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఉన్న కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.ప్రతి ఏటా బోనాల పండుగ సంబురాల సందర్భంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్ల దేవాలయాలన్నీ ముస్తాబవుతాయి. గోల్కోండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు.భోజనంనుంచి వచ్చిందే బోనంసంస్కృత పదం భోజనం నుంచి వచ్చింది బోనం అని అర్థం. బోనం అంటే కుండలలో వండి అమ్మవారికి సమర్పించే నైవేద్యం. వివిధ ప్రాంతాలలో, బోనాలు పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ , నూకాలమ్మ వంటి అనేక పేర్లతో అమ్మవారిని ఆరాధించడం. ఈ బోనాల పండగ దాదాపు వెయ్యేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమితినిచ్చారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం, రెండో బోనం బల్కం పేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో వారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు.ప్రజలు ప్రతి ఆదివారం స్త్రీలు ఉదయాన్నే లేచి, శుచిగా స్నానం చేసి, శుభ్రంగా, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త మట్టి కుండలో అన్నం, పెరుగు, నీరు ,బెల్లం కలిపి క్షీరాన్ని వండుతారు. కుండను ఎరుపు, తెలుపు పసుపు రంగుల కలయికతో అలంకరిస్తారు. ఈ కుండపై కప్పి, పైన వేప ఆకులను ఉంచి, పైన దీపం వెలిగిస్తారు. ఇదే బోనం జ్యోతి. దీనితోపాటు మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులు , చీరలను సమర్పిస్తారుబోనాలు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పోతురాజే. పోతరాజును మహంకాళి దేవి సోదరుడని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబురాలు మస్తుగా షురూ అవుతయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల విశ్వాసం.అతేకాదు బోనంతో విషజ్వరాలకు, అనేక రకాల వైరస్లకుచెక్ పెట్టే ఆచారం ఉంది. వర్షాకాలంలలో వచ్చే ఆఫాఢంలో పలు అంటు రోగాలు వస్తుంటాయి. అలాంటివేమీ రాకుండా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూసి. శుభ్రమైన వేపాకులు కడతారు. సహజ క్రిమి సంహారిణి అయిన పసుపు, వేపగాలి పీల్చడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు నాశనమవుతాయి. ఇది పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యానికి మంచిదని విశ్వాసం.ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్రసికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ య్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు. అపుడు అమ్మవారి దయతో వ్యాధి తగ్గిపోవడం, ప్రజలు సంతోషంగా ఉండటంతో , ఇక అప్పటినుంచి 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అలా ఆషాఢంలో బోనాల సంబురాలు జరుగుతున్నాయి.విదేశాల్లోనూ బోనాల పండుగ..కేవలం తెలంగాణలోనే కాదు, దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పేలా ఈ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. -
వైభవంగా లాల్ దర్వాజా బోనాలు
-
లండన్‌లో ఘనంగా బోనాల జాతర వేడుకలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులు హాజరైన ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 మందికి పైగా ప్రవాస సభ్యులు హాజరయ్యారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమానికి అధికార ప్రతినిధి హరిగౌడ్ వాఖ్యాతగా వ్యవహరించారు. సాంప్రదాయ బద్దంగా పూజలు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ఎన్నారైలను ముగ్ధులను చేశాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం పోతురాజు వేషధారణ ఆకట్టుకుంది. సందీప్ కుమార్ బుక్క బృందం పర్యవేక్షణలోనే జరిగిన పోతురాజు విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని.. టాక్ సంస్థ, టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం సేవలను కొనియాడారు. ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తొట్టెల ఊరేగింపు అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను సత్కరించి, బహుమతులందజేశారు. ఎంపీ రూత్ క్యాడ్బరి కూడా ఈ ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని కోరారు. టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలుస్తున్న ఎంఎల్సీ కవితకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించు కున్నామన్నారు. టాక్ జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆమె సభకు వివరించారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు-బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు అశోక్ దూసరి తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ కూర్మచలం కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపి, వారిని సత్కరించారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి మన దేశమంతా అమలు కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలంతా నినదించారు. ‘ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే’ ఉదయ్ నాగరాజు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి మహాశక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది. అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి, సభ్యులు.. పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృధ్వి, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నికిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్‌రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బోనమెత్తిన గోల్కొండ
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తొట్టెల - వేలాదిగా తరలివచ్చిన భక్తులు సాక్షి, హైదరాబాద్: పోతురాజు విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు, శివసత్తుల ప్రదర్శన.. డప్పు వాయిద్యాలు.. కోలాటాలు.. భక్తజనం సమర్పించిన బోనాలతో గోల్కొండ బోనమెత్తింది. హైదరాబాద్ నగరా నికి తలమానికమైన గోల్కొండలో ఆషాఢ జాతరగా పిలిచే తొలి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ వరకు ఆధ్యా త్మిక వాతావరణం వెల్లి విరిసింది. భక్తజనం వెంట రాగా జగదంబిక మహంకాళి అమ్మవారి రథం లంగర్‌హౌజ్ నుంచి ముందుకు కదిలి, సాయంత్రానికి గోల్కొండ కోటపైన ఉన్న జగదంబికా అమ్మ వారి ఆల యం వద్దకు చేరింది. వేలాది భక్తులు అమ్మవారి కి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాలు ప్రారంభమయ్యాయిలా... ఈ బోనాల సందర్భంగా తొలిపూజను చోటా బజార్‌లోని ప్రధాన అర్చకుడు అనంతాచారి ఇంట్లో నిర్వహించారు. అనంతరం వేదపండి తులు రామాకాంత్ వైద్యుల ఇంట్లో వేదశాస్త్రం ప్రకారం పీఠపూజ చేశారు. ఉదయం 11 గంట లకు లంగర్‌హౌస్ గాంధీ విగ్రహం నుంచి ప్రా రంభమైన ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, సాకపోసి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తొట్టెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీ చార్మినార్ నుంచి ప్యారసాని శ్రీనివాస్ ప్రత్యేకంగా 25 అడుగుల ఎత్తున తయారు చేసిన తొట్టెల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఊరేగింపులో ప్రత్యేక అలంకరణతో తయారు చేసిన హంసవాహనం వేలాదిమంది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. -
బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి: ఉపసర్పంచ్ మృతి
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్ల గ్రామంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఉప సర్పంచ్ మక్కు కృష్ణ (30) మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం ఉత్సవాల సందర్భంగా విద్యుత్ తీగల నుంచి విద్యుత్ తీసుకునేందుకు వైర్ వేస్తుండగా షాక్ కొట్టడంతో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాతబస్తీలో ఎక్సైజ్ ‘బోనాల’ దాడులు
చార్మినార్: బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వాఖ అధికారులు శనిఆదివారాల్లో పాతబస్తీలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3900 గుడుంబా ప్యాకెట్లు, 25 లీటర్ల కల్లు, 32 విస్కీ (180ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. చంద్రశేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాగ్ , భయ్యాలాల్‌నగర్, ఉప్పుగూడ సాయిబాబానగర్, సరూర్‌నగర్ ఎర్రకుంట, చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని అడ్డాలపై దాడులు చేసి పెద్ద మొత్తంలో గుడుంబాను, 32 విస్కీ (180ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘రజని’ ట్రయల్..
బహదూర్‌పురా: బోనాల ఉత్సవాల ఊరేగింపులో పాల్గొననున్న రజని ఏనుగుతో జూ అసిస్టెంట్ క్యూరేటర్, బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ హరీష్ కౌషిక్‌లు సోమవారం ట్రయల్ నిర్వహించారు. జూ పార్కు ప్రధాన ముఖద్వారం నుంచి కిషన్‌బాగ్ వెనుక వైపు జూ సర్వీస్ గేట్ వరకు ట్రయల్‌ను నిర్వహించారు. సికింద్రాబాద్‌తో పాటు పాతబస్తీలో జరిగే బోనాల ఊరేగింపులో రజని పాల్గొంటుందని జూ అధికారులు తెలిపారు. -
బోనమెత్తిన గోల్కొండ
-
బోనమెత్తిన గోల్కొండ
* ప్రారంభమైన బోనాల ఉత్సవాలు * పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు నాయిని, పద్మారావు * అమ్మవారికి కల్లుకుండతో సాక హైదరాబాద్: ‘అమ్మా బెలైల్లినాదో.. నా తల్లీ బెలైల్లినాదో..’ అంటూ గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఊరేగింపుతో తెలంగాణ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం చారిత్రక గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి ఆషాడమాసంలో మొదటి పూజ చేసి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. లంగర్‌హౌస్‌లో రాష్ట్రప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు అమ్మవారికి అధికారిక లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. పట్టువస్త్రాలతో పాటు అమ్మవారి మొదటి బోనం(నజర్ బోనం), ఒక్కొక్కటీ 15 మీటర్ల ఎత్తు ఉన్న 40 తొట్టెలను ఊరేగింపుగా కోటకు తీసుకెళ్లారు. చోటాబజార్‌లో అమ్మవారి ఉత్సవమూర్తులకు పూజారులు దిగంబరరావు ఇంట్లో పూజలు నిర్వహించి బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఆడపడుచులు బోనాలు తీసుకురాగా అక్కడి నుండి పల్లకిలో అమ్మవారిని ఊరేగిస్తూ గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారి వద్దకెళ్లారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుండి గోల్కొండ కోట వరకు ఆడపడుచులు అడుగడుగునా అమ్మవారికి సాక సమర్పిస్తూ స్వాగతం పలికారు. అమ్మవారి తమ్మునిగా చెప్పబడే పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, యువకుల చిందులు ఊరేగింపులో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. పలువురు ముస్లిం సోదరులు బోనాల ఊరేగింపునకు పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొని ఐకమత్యాన్ని చాటారు. ప్రభుత్వమే నిర్వహిస్తుంది: నాయిని బోనాల ఉత్సవాలను పూర్తి బాధ్యతతో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అమ్మవారు శాంతించి పిల్లలను, తోటి వారిని చల్లంగ చూడాలని కోరుతూ ఎన్ని కష్టాల్లో ఉన్నా అమ్మవారికి ప్రజలు సంతోషంగా బోనాలు సమర్పిస్తారని, పలు గ్రామాల నుంచి ప్రజలు నగరానికి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ముందుముందు మరింత వైభవంగా బోనాల వేడుకలు నిర్వహిస్తామన్నారు. కల్లు సాక సమర్పించిన పద్మారావు కల్లు కుండను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చి జగదాంబికా అమ్మవారికి సాక సమర్పించి అందరినీ ఆకట్టుకున్నారు ఆబ్కారీ మంత్రి పద్మారావు. అమ్మవారికి కల్లును సాక గా సమర్పించడం ఆనవాయితీ అని, అందుకే ఈసారి తాను కల్లు సాక సమర్పించానని పద్మారావు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల వేడుకలను ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇకపై సొంత రాష్ట్రంలో మన పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు కోయల్కర్ గోవింద్రాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు కావూరి వెంకటేష్, జీవన్‌సింగ్ ఈ వేడుకలను నిర్వహించారు. ప్రారంభ వేడుకల్లో బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, దైవజ్ఞశర్మ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. -
ఈసారి మంచి వర్షాలు
భవిష్యవాణి వినిపించిన అమ్మవారు సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారిని అంబారీపై ఊరేగించడం.. ఘటానికి సాగనంపడంతో లష్కర్ బోనాలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన భక్తులు భవిష్యవాణిని వినేందుకు ఆసక్తి చూపారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరీ అమ్మవారి ఆలయం ముందు జోగిని స్వర్ణలత పచ్చికుండపై నిలబడగా.. అమ్మవారు ఆవహించడంతో భవిష్యవాణి చెప్పారు. ‘ఈ ఏడాది పూజలతో సంతృప్తి చెందాను.. చాలా సంతోషంగా ఉంది.. మీరు తిన్నా తినకున్నా పువ్వో, పత్రో నాకు పెడుతున్నారు.. అదే నాకు సంతోషం.. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయి.. ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు... ఇదే నేను ప్రజలకిచ్చే దీవెన.. నాకు కోపం తెప్పించవద్దు.. తప్పు చేస్తే నా ఆగ్రహానికి గురికాక తప్పదు.. నా ఆజ్ఞ లేనిదే ఆలయంలో ఏ పని మొదలు పెట్టవద్దు.. ఇటీవల బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతై ఆ తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలింది కదా? అని భక్తులు ప్రశ్నించగా... ఎవరి ఖర్మ వారు అనుభవించాల్సిందే అది దైవనిర్ణయం... దీనికి ఎవరూ అతీతులు కారు’ అంటూ స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. -
గోల్కొండంత జనం
-
పరమత సహనం.. బోనం
సంప్రదాయం: ‘‘అమ్మా బెలైల్లినాదో నాయనా... తల్లీ బెలైల్లినాదో నాయనా...’’ ఆషాఢమాసం ఆదివారం భాగ్యనగర లోగిళ్లలో మార్మోగే జనపదం ఇది. ఆషాఢం అంటేనే ఈ మహానగరికి పూనకం వస్తుంది. బోనాలంటే భక్తి భావంతో పొంగి పోవడమే కాదు.. సమష్టి తత్వానికి.. పరమత సహనానికి ప్రతీక. 1908, సెప్టెంబర్ 28 తెల్లవారుజాము 2 గంటలు.. ప్రశాంతంగా సాగిపోతున్న మూసీ నది.. ఉగ్రరూపం దాల్చిన వేళ. మరో నాలుగు గంటలయ్యే సరికి ప్రళయాన్ని తలపించింది. 60 అడుగుల మేర ఉవ్వెత్తున పొంగిన మూసీ.. నగరంపై జల ఖడ్గం ఝళిపించింది. అఫ్జల్‌గంజ్, ముస్లింజంగ్, ఛాదర్‌ఘాట్ వంతెనలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. 15 వేల మంది ప్రాణాలను హరించింది. పరీవాహక ప్రాంతంలోని 80 వేల ఇళ్లను ముంచెత్తింది. చార్మినార్ కట్టడంలో భాగంగా ఉన్న భాగ్యలక్ష్మీ దేవిని పూజిస్తే మూసీ శాంతిస్తుందన్న మాట ఆరో నిజాం చెవిన పడింది. వెంటనే ఆయన అమ్మవారికి రాజప్రాసాదం నుంచి చీర-సారె పంపి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆనాటి నుంచి ప్రతిసారీ బోనాల వేడుకకు ఆ అమ్మవారికి చీర-సారె పంపడం ఆనవాయితీగా మారింది. తర్వాతి కాలంలో రజాకార్లు అరాచకం సృష్టించిన రోజుల్లోనూ.., బోనాల వేడుక మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచింది. నగర జీవనంతో పెనవేసుకున్న ఈ జనోత్సవానికి నిజాం ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది. ప్రతి ఆషాఢం తొలి ఆదివారం గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, మూడో వారం పాతబస్తీలోని మూసీ ఈవల ప్రాంతం, నాలుగో ఆదివారం మూసీ అవతలి పాతబస్తీలో బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఆ ఏనుగే సాక్ష్యం : బోనాల వేడుక పరమత సహనానికి ప్రతీక. నిజాం కాలం నుంచి నేటి వరకు ఈ జన జాతరలో అపశ్రుతులు దొర్లిన సందర్భాలు లేవు. పాతబస్తీలో అమ్మవారి ఘటాలతో నిర్వహించే ఊరేగింపులో పాల్గొన్న వారికి దాహం కోసం ముస్లిం సోదరులు మంచి నీటిని అందించేవారు. నేటికీ చాలా మంది ముస్లింలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అక్కన్నమాదన్న దేవాలయం దగ్గర, లష్కర్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం దగ్గర సామూహిక ఊరేగింపులో ఏనుగు పాల్గొనటం ఆనవాయితీ. పదిహేనేళ్ల కిందట.. ఏటా ఉత్సవంలో పాల్గొనే ఏనుగును జాతరలో వినియోగించే పరిస్థితి కనిపించలేదు. అనాదిగా వస్తున్న ఆచారం పడిపోతుందని నిర్వాహకులు బాధపడుతున్న సమయంలో.. నిజాం ట్రస్టు నిర్వాహకులు హష్మీ అని పిలుచుకునే తమ ఏనుగును జాతరకు పంపారు. అప్పటి వరకు బీబీకాఆలం ఊరేగింపులో మాత్రమే పాల్గొన్న ఆ ఏనుగు.. అమ్మవారి సేవలో పాల్గొంది. మతాలు వేరైనా భక్తి భావం ఒక్కటే అని చాటిన ఈ సంఘటన మతసామరస్యానికి నిదర్శనం. - గౌరీభట్ల నరసింహమూర్తి