‘అమ్మా బెలైల్లినాదో.. నా తల్లీ బెలైల్లినాదో..’ అంటూ గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఊరేగింపుతో తెలంగాణ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం చారిత్రక గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబికా అమ్మవారికి ఆషాడమాసంలో మొదటి పూజ చేసి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. లంగర్‌హౌస్‌లో రాష్ట్రప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు అమ్మవారికి అధికారిక లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ప్రారంభించారు.